హీరమండలం శ్రీకాకుళం జిల్లాకు చెందిన మండలము. మండలంలో వంశధారనది ప్రవహిస్తుంది. గొట్ట అనే గ్రామం వద్ద వంశధార నదిపై బ్యారేజి నిర్మించారు. ఇదే గొట్టబ్యారేజీగా పిలువబడుతుంది. మహేంద్రతనయ నది వంశధార నదిలో ఈ మండలంలోని గులుమూరు వద్ద సంగమిస్తుంది. ఈ మండలం పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గం, శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 49953. మండలంలో 37 రెవెన్యూ గ్రామాలు, 23 గ్రామ పంచాయతిలు కలవు.
సరిహద్దులు: ఈ మండలమునకు తూర్పున పాతపట్నం, సారవకోట మండలాలు, దక్షిణాన జలుమూరు, ఎల్.ఎల్.పేట మండలాలు, పశ్చిమాన సీతంపేట మండలం, ఉత్తరాన కొత్తూరు మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 46,204. ఇందులో పురుషులు 22,954, మహిళలు 23,250. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 49953. ఇందులో పురుషులు 24942, మహిళలు 25011. పట్టణ జనాభా 6576, గ్రామీణ జనాభా 43377. రాజకీయాలు: ఈ మండలం పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గం, శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2012 ఒరిస్సా స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ మండలం ధనుపురం గ్రామానికి చెందిన పొట్నూరు లత జడ్పీ చైర్మెన్ అయ్యారు.
మండలం గుండా ఎలాంటి జాతీయరహదారులు కాని, రైలుమార్గాలు కాని లేవు. అయిననూ తూర్పున ఉన్న పాతపట్నం మండలం నుంచి రైలుమార్గం, దక్షిణాన మరియు పశ్చిమాన ఉన్న మండలాల నుంచి జాతీయ రహదాలున్నాయి. శ్రీకాకుళం నుంచి గుణుపూరు వెళ్ళు రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నది. మండలంలోని గ్రామాలు: అంతకపల్లి • అంతిలి • అంబవల్లి • కల్లట • కిట్టలపాడు • కొండరాగోలు • కొరడ • కోమనపల్లి • గార్లపాడు • గులుమూరు • గొడియాపాడు • గొత్త • చిన్నకొల్లివలస • చోర్లంగి • జగన్నాధపురం • తంప • తాళ్ళపాడు • తుంగతంపర • తులగం • దుగ్గుపురం • దుర్బలపురం • ధనుపురము • నీలదేవిపురం • పడలి • పిండ్రువాడ • పెద్దసంకిలి • భాగీరధీపురం • మజ్జిగూడెం • మహాలక్ష్మీపురం • మామిడిజోల • మోక్ష అవలంగి • రెల్లివలస • లింగుపురం • లోకొండ • సత్యజగన్నాథ పురం • సీధి • హీరమండలం
= = = = =
|
12, ఏప్రిల్ 2015, ఆదివారం
హీరమండలం (Heeramandalam)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి