సంజామల కర్నూలు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలంలో పాలేరు వాగు ప్రవహిస్తుంది. బ్రిటీష్ అధికారులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఈ మండలంలోనే పట్టుకొని కోవెలకుంట్ల వద్ద ఉరితీశారు. ప్రముఖ రాజకీయ నాయకుడు పెండేకంటి వెంకటసుబ్బయ్య ఈ మండలమునకు చెందినవారు. ఈ మండలము బనగానపల్లె అసెంబ్లీ నియోజకవర్గం, నంద్యాల లోకసభ నియోజవర్గంలో భాగంగా ఉంది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 37494.
భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా సంజామల మండలం కర్నూలు జిల్లాలో దక్షిణ భాగంలో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన బనగానపల్లె మండలం, పశ్చిమాన అవుకు మరియు కొలిమిగుంట్ల మండలాలు, దక్షిణాన కొలిమిగుంట్ల మండలం, ఈశాన్యాన కోవెలకుంట్ల మండలం, తూర్పున ఉయ్యాలవాడ మండలం, ఆగ్నేయాన కడప జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. చరిత్ర: సంజామల స్వాతంత్ర్యానికి పూర్వం బనగానపల్లె సంస్థానంలో భాగంగా ఉండేది. 1897-1898 సంవత్సరంలో ఇక్కడి ప్రజలు బనగానపల్లె నవాబు అడ్డగోలుగా విధిస్తున్న భరించలేని భూమిశిస్తుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ సంఘటన సంజామల తిరుగుబాటుగా ప్రసిద్ధి చెందింది. 1847లో రామభద్రునిపల్లె వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని పట్టుకొని ఉరుతీశారు. నిజాం దత్త మండలాలను బ్రిటీషు వారికి అప్పగించినప్పుడు బనగానపల్లె సంస్థానంలో భాగమైన సంజామల కూడా బ్రిటీషు పాలనలోకి వచ్చింది. స్వాతంత్ర్యం తర్వాత బనగానపల్లె తాలూకాలో ఫిర్కాగా ఉన్న సంజామల 1952లో కోయిలకుంట్ల తాలూకాకు బదిలీ చేయబడింది. 1986లో మండలాల అవతరణతో ఇది ప్రత్యేకంగా మండలంగా ఏర్పడింది.
రాజకీయాలు: ఈ మండలము బనగానపల్లె అసెంబ్లీ నియోజకవర్గం, నంద్యాల లోకసభ నియోజవర్గంలో భాగంగా ఉంది. ప్రముఖ రాజకీయ నాయకుడు పెండేకంటి వెంకటసుబ్బయ్య ఈ మండలమునకు చెందినవారు. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 35431. ఇందులో పురుషులు 17977, మహిళలు 17454. గృహాల సంఖ్య 7694. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 37494. ఇందులో పురుషులు 18866, మహిళలు 18628. మండలంలోని గ్రామాలు: అలువకొండ · ఆకుమల్ల · ఎగ్గోని · కమలాపురి · కానాల · గిద్దలూరు · దత్తాపురం (నిర్జన గ్రామము) · నట్లకొత్తూరు · నొస్సం · పేరుసోమల · బొందలదిన్నె · మంగపల్లె · మిక్కినేనిపల్లె · ముక్కామల్ల · ముచ్చలపురి · ముదిగాడు · రామభద్రునిపల్లె · లింగందిన్నె · వసంతాపురం · సంజామల · హోత్రమనదిన్నె
= = = = =
|
2, జులై 2015, గురువారం
సంజామల మండలం (Sanjamala Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి