29, మే 2016, ఆదివారం

కోదాడ మండలం (Kodad mandal)

 కోదాడ మండలం
జిల్లాసూర్యాపేట జిల్లా
అసెంబ్లీ నియో.కోదాడ అ/ని,
లోకసభ నియో.నల్గొండ లో/ని,
జనాభా116358 (2001),
133128 (2011),
కోదాడ సూర్యాపేట జిల్లాకు చెందిన మండలము. పూనా-విజయవాడ (9వ నెంబరు ) జాతీయ రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు, 28 గ్రామపంచాయతీలు కలవు. ప్రముఖ సినీనటుడు తాడేపల్లి కాంతారావు ఈ మండలమునకు చెందినవారు. పూనా-విజయవాడ జాతీయ రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నది

భౌగోళికం, సరిహద్దులు:
కోదాడ మండలము నల్గొండ జిల్లాలో అతి తూర్పున ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కృష్ణా జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి దక్షిణాన మేళ్లచెరువు మండలం, పశ్చిమాన చిలకూరు మండలం, వాయువ్యాన నడిగూడెం మండలాలు సరిహద్దులుగా ఉండగా మిగితా వైపుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దుగా ఉంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 116358, 2011 నాటికి జనాభా 16770 పెరిగి 133128 కు పెరిగింది. 2001 మరియు 2011 ప్రకారము జిల్లాలో అత్యధిక జనాభా కల మండలాలలో నాలుగవస్థానంలో ఉంది.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 133128. ఇందులో పురుషులు 66666, మహిళలు 66642. పట్టణ జనాభా 64246, గ్రామీణ జనాభా 68882. 2011 జనాభా ప్రకారం ఈ మండలం జిల్లాలో 4వ స్థానంలో ఉంది.
కాంతారావు

రాజకీయాలు:
ఈ మండలము కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.

రవాణా సౌకర్యాలు:
ఈ మండలానికి రైలు సౌకర్యం లేదు. పూనా-విజయవాడ జాతీయ రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నది. 


విభాగాలు: సూర్యాపేట జిల్లా మండలాలు,  కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గం,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక