29, మే 2016, ఆదివారం

దామరచర్ల మండలం (Damarcharla Mandal)

జిల్లానల్గొండ జిల్లా
అసెంబ్లీ నియో.మిర్యాలగూడ అ/ని,
లోకసభ నియో.నల్గొండ లో/ని,
జనాభా61576 (2001),
66915 (2011)
దామరచర్ల నల్గొండ జిల్లాకు చెందిన మండలము. కృష్ణా, మూసీనదుల సంగమస్థానం వాడపల్లి ఈ మండలంలో ఉంది. ఇది మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగము. మండలంలో 18 రెవెన్యూ గ్రామాలు, 24 గ్రామపంచాయతీలు కలవు. మండల పరిధిలో పెన్నా సిమెంట్ కర్మాగారం, ఇండియా సిమెంట్స్ కర్మాగారం ఉన్నాయి. నక్రేకల్ గుంటూరు రహదారి, బీబీనగర్ నడికూడి రైలుమార్గం మండలం మీదుగా వెళ్ళుచున్నాయి.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలం నల్గొండ జిల్లాలో దక్షిణ సరిహద్దులో కృష్ణానది తీరాన ఉంది. తూర్పున నేరెడుచర్ల మండలం, ఉత్తరాన మిర్యాలగూడ మండలం, పశ్చిమాన అనుముల, పెద్దవూర మండలాలు, దక్షిణాన గుంటూరు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 61576, 2011 నాటికి జనాభా 5339 పెరిగి 66915 కు పెరిగింది. 2001 మరియు జిల్లాలో అత్యధిక జనాభా కల మండలాలలో 12వ స్థానంలో ఉండగా 2011 నాటికి 11వ స్థానానికి చేరింది.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 66915. ఇందులో పురుషులు 33956, మహిళలు 32959. 2011 జనాభా ప్రకారం ఈ మండలం జిల్లాలో 11వ స్థానంలో ఉంది.


అధ్యాత్మికం:
కృష్ణా, మూసీల సంగమస్థానమైన వాడపల్లిలో చారిత్రక ఆలయాలైన శ్రీమీనాక్షి అగస్తేశ్వర, శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయాలున్నాయి. ఈ ఆలయాలు 12వ శతాబ్దిలో రెండో ప్రతాపరుద్రుని కాలంలో నిర్మించబడ్డాయి. రెడ్డి రాజులు వీటిని పునరుద్ధరించారు. శాతవాహనులు ఈ ప్రాంతంలో కోటలు నిర్మించారు. పురాతన కాలంలో ఇది ఓడరేవు. శాతవాహనుల కాలంలో ఓడరేవు ప్రసిద్ధి చెందినది. దీనితో ఓడపల్లిగా మారింది. అదే వాడపల్లి అయింది.


రాజకీయాలు:
ఈ మండలము మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగము.



విభాగాలు: నల్గొండ జిల్లా మండలాలు, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం,, 


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక