జగిత్యాల జిల్లా తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 18 మండలాలు ఉన్నాయి. ఈ జిల్లాలోని అన్ని మండలాలు మునుపటి కరీంనగర్ జిల్లాలోనివి. జగిత్యాల పట్టణం ఈ ప్రతిపాదిత జిల్లాకు పరిపాలన కేంద్రంగా ఉంటుంది. ఈ జిల్లాకు ఉత్తరాన గోదావరి నది ప్రవహిస్తుంది. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, శాతవాహనుల రాజధాని కోటిలింగాల ఈ జిల్లాలో ఉంది.
జిల్లా సరిహద్దులు: ఈ ప్రతిపాదిత జిల్లాకు ఉత్తరాన కొమురంభీం జిల్లా మరియు నిర్మల్ జిల్లాలు, తూర్పున పెద్దపల్లి జిల్లా, దక్షిణాన కరీంనగర్ జిల్లా, పశ్చిమాన నిజామాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలాలు: జగిత్యాల, జగిత్యాల గ్రామీణ, రాయికల్, సారంగాపూర్, బీర్పూర్, ధర్మపురి, బుగ్గారం, పెగడపల్లి, గొల్లపల్లి, మల్యాల్, కొడిమ్యాల్, వెల్గటూర్, కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి, కతలాపూర్. ఇవి కూడా చూడండి:
= = = = =
ఆధారాలు:
|
Tags: News Districts in telangana, Jagityal Dist in Telugu
Tags: Jagityal Dist in Telugu, jagityala jilla telugulo, jagityala zilla in telugu, 27 districts in telangana in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి