సూర్యాపేట జిల్లా తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి. అక్టోబర్ 11, 2016 దసరా పండుగనాడు ఈ జిల్లా అవతరించింది. ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 23 మండలాలు ఉన్నాయి. 65వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్న సూర్యాపేట పట్టణం ఈ జిల్లా పరిపాలనకేంద్రంగా ఉంది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి నల్గొండ జిల్లా లోనివి. సూర్యాపేట పట్టణం 65వ నెంబరు (పాతపేరు 9) జాతీయ
రహదారిపై ఉంది.
సరిహద్దులు: ఈ ప్రతిపాదిత జిల్లాకు తూర్పున ఖమ్మం జిల్లా, పశ్చిమాన నల్గొండ జిల్లా, ఉత్తరాన వరంగల్ జిల్లా, ఈశాన్యాన మహబూబాబాద్ జిల్లా, వాయువ్యాన యాదాద్రి జిల్లా, దక్షిణాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులుగా ఉంటాయి. మండలాలు: ఆత్మకూర్ (ఎస్), చివ్వెంల, మోతి, జాజిరెడ్డిగూడెం, నూతనకల్, పెన్‌పహాడ్, సూర్యాపేట్, తిరుమలగిరి, తుంగతుర్తి, గరిడేపల్లి, నేరెడుచర్ల, నాగారం, మద్దిరాల, పాలకీడు, చిల్కూర్, హుజూర్‌నగర్, కోదాడ్, మఠంపల్లి, మేళ్ళచెరువు, మునగాల, నడిగూడెం, అనంతగిరి, చింతలపాలెం. ఇవి కూడా చూడండి:
= = = = =
|
Tags: News Districts in telangana, Suryapet Dist in Telugu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి