తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటైన వరంగల్ పట్టణ జిల్లా చరిత్రలో ముఖ్యంగా కాకతీయుల కాలంలో వైభవంగా వెలుగొందిన ప్రాంతము. ఓరుగల్లుగా, ఏకశిలానగరంగా పిలువబడిన బడిన వరంగల్లు నగరం ఈ జిల్లా పరిపాలన కేంద్రము. కాకతీయ విశ్వవిద్యాలయము, కాకతీయ మెడికల్ కాలేజి, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (పూర్వపు రీజినల్ ఇంజనీరింగ్ కాలేజ్), కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ మొదలైన ప్రముఖ విద్యా సంస్థలు జిల్లాలో ఉన్నాయి. జిల్లాలో 11 రెవెన్యూ మండలాలు, 124 రెవెన్యూ గ్రామాలు కలవు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ జిల్లాకు తూర్పున వరంగల్ గ్రామీణ జిల్లా, దక్షిణాన జనగామ జిల్లా, పశ్చిమాన సిద్ధిపేట జిల్లా, ఉత్తరాన కరీంనగర్ జిల్లా, సరిహద్దులుగా ఉన్నాయి. చరిత్ర: కాకతీయ సామ్రాజ్యము కాలంలో ఓరుగల్లు రాజధానిగా ఉండేది. కాకతీయుల శిలాతోరణం చూపురులకు ఇప్పటికీ కనులవిందు చేస్తోంది. కాకతీయుల కాలం నాటి ఆలయాలు, చెరువులు, శిల్పకళా సంపద జిల్లాలోని పలుచోట్ల కనిపిస్తాయి. 14 వ శతాబ్దంలో ఢిల్లీ తుగ్లక్ సుల్తానుల చేతిలో ఓడిపోవడంతో కాకతీయుల పరిపాలన అంతమయింది. తరువాత అది ముసునూరి నాయకులు, రేచెర్ల నాయకులు, బహమనీ సుల్తానులు, గోల్కొండను పాలించిన దక్కను సుల్తానుల పాలన లోకి వచ్చింది. మొగలు చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండను 1687 లో ఆక్రమించినపుడు అది మొగలు సామ్రాజ్యంలో భాగమయింది. తరువాత 1724లో ఈ సామ్రాజ్యం లోని దక్షిణ ప్రాంతం విడివడి హైదరాబాదు రాజ్యం ఏర్పడినపుడు వరంగల్లు ఆ రాజ్యంలో భాగమైంది. 1948 సెప్టెంబరు 17న భారతదేశంలో కలిసి పోయింది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా హైదరాబాదు రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది. జూన్ 2, 2014న నూతనంగా ఆవిర్భవించిన తెలంగానలో అంతర్భాగంగా ఉంది. అక్టోబరు 11, 2016న జిల్లా ముక్కలై కొత్తగా వరంగల్ గ్రామీణ, జనగామ, మహబూబాబాదు, భూపాలపల్లి జిల్లాలు ఏర్పడ్డాయి. ఇవి కూడా చూడండి:
= = = = =
|
15, ఆగస్టు 2014, శుక్రవారం
వరంగల్ పట్టణ జిల్లా (Warangal Urban Dist)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి