యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ లోని 33 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న ఈ జిల్లా కొత్తగా అవతరించింది. ఈ జిల్లాలో 16 మండలాలు, 2 రెవెన్యూ డివిజన్లు (భువనగిరి మరియు చౌటుప్పల్) ఉన్నాయి. జిల్లా పరిపాలన కేంద్రం భువనగిరి. తెలంగాణలోని ప్రముఖమైన అధ్యాత్మికక్షేత్రం యాదాద్రి పేరిట జిల్లాకు నామకరణం చేయబడింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి నల్గొండ జిల్లా లోనివే. భౌగోళికంగా ఈ జిల్లా రాష్ట్రం మధ్యలో ఉంటుంది.
ప్రముఖ ప్రజాకవి సుద్దాల హన్మంతు, సినీపాటల రచయిత సుద్దాల అశోక్ తేజ ఈ జిల్లాకు చెందినవారు. సిల్క్ చీరలకు పేరుగాంచిన పోచంపల్లి గ్రామం ఈ జిల్లాలో ఉంది. వినోభాభావే చేఅట్టిన భూదానోద్యమం కూడా ఈ జిల్లా పోచంపల్లి నుంచే ప్రారంభమైంది. సరిహద్దులు: ఈ జిల్లాకు తూర్పున వరంగల్ జిల్లా, ఆగ్నేయాన సూర్యాపేట జిల్లా, దక్షిణాన నల్గొండ జిల్లా, పశ్చిమాన రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లాలు, వాయువ్యాన మల్కాజ్‌గిరి, సిద్ధిపేట జిల్లాలు సరిహద్దులుగా ఉంటాయి. మండలాలు: ఆలేరు, మోటకొండూరు, రాజాపేట్, మోత్కూర్, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, బీబీనగర్, బొమ్మలరామారాం, ఆత్మకూర్ (ఎం), అడ్డగూడూరు, పోచంపల్లి, రామన్నపేట్, వలిగొండ, చౌటుప్పల్, నారాయణపూర్. ఇవి కూడా చూడండి:
= = = = =
|
Tags: News Districts in telangana, yagadri Dist in Telugu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి