గోల్కొండ కోట హైదరాబాదు నగరంలో ఎత్తయిన నల్లరాతి కొండపై ఉంది. కోట రక్షణార్ధం దాని చుట్టూ పెద్ద బురుజు కూడా నిర్మించబడింది. క్రీ.శ. 1083 నుండి 1323 వరకు పాలించిన కాకతీయుల కాలంలో ఇది నిర్మించబడినట్లు చరిత్రకారులు నిర్థారించారు. కాకతీయుల పతనం తర్వాత గోల్కొండ కోట ఢిల్లీసుల్తానుల అధీనంలో కొంతకాలం ఉండి తర్వాత 1326లో ముసునూరి నాయకులు మహమ్మద్ బీన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను తిరిగి సాధించారు. 1371లో ముసునూరి కాపానీడు గోల్కొండను సంధిలో భాగముగా బహమనీ సుల్తాను మహమ్మదు షా వశము చేశాడు. 1512 తరువాత ముస్లిము సుల్తానుల రాజ్యములో రాజధానిగా చేయబడినది.
గోల్కొండ నాలుగు వేర్వేరు కోటల సముదాయం, ఒకదానిని చుట్టి మరొకటి నిర్మించబడ్డాయి. మట్టికోటను రాతికోటగా మలిచినది కుతుబ్‌షాహిలే. దుర్గం చుట్టూ గుట్టలు పెట్టని కోటలవలె ఉన్నాయి. ఈ కోట 87 అర్ధ చంద్రాకారపు బురుజులతోకూడిన 10 కి.మీ. పొడవు గోడను కలిగి ఉంది. ఇంకా 8 సింహద్వారములు, రాచమందిరాలు, మసీదులు, దేవాలయాలు, అశ్వశాలలు మొదలగునవి ఉండేవి. సింహద్వారములలో అన్నిటికంటే కిందది మరియు అన్నిటికంటే బయట ఉండేది ఫతే దర్వాజా (విజయ ద్వారము). ఔరంగజేబు విజయము తరువాత ఈ ద్వారము గుండానే తన సైన్యమును నడిపించాడు. ఏనుగుల రాకను ఆడ్డుకోవటానికి ఆగ్నేయము వైపున పెద్ద పెద్ద ఇనుప సువ్వలు ఏర్పాటు చేసారు. ఫతే దర్వాజా నిర్మించటానికి ధ్వనిశాస్త్రమును ఔపోసన పట్టినట్లున్నారు. గుమ్మటం కింద ఒక నిర్ణీత ప్రదేశమునందు చప్పట్లు కొడితే కిలోమీటరు ఆవల గోల్కొండలో అతి ఎత్తయిన ప్రదేశములో ఉన్న "బాలా హిస్సారు" వద్ద వినిపిస్తుంది. ఈ విశేషమును ఒకప్పుడు ఇక్కడి నిర్వాసితులు ప్రమాద సంకేతములు తెలుపుటకు ఉపయోగించేవారు. ఇప్పుడు మాత్రం సందర్శకులకు వినోదం పంచేదిగా మిగిలిపోయింది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
Tags: Golkonda Fort in Telugu, Telangana Forts, Hyderabad information, Telangana Tousism, Hyderabad Tourism,
Very intersting i like this so much
రిప్లయితొలగించండి