21, జులై 2020, మంగళవారం

కుతుబ్ షాహీ రాజవంశం (Qutb Shahi Dynasty)

కుతుబ్‌షాహీలు
పాలనాకాలంక్రీ.శ.1512 నుంచి 1687
రాజ్య స్థాపకుడుసుల్తాన్ కులీకుతుబ్ షా
రాజధానిగోల్కొండ & హైదరాబాదు
రాజ్యవిస్తరణప్రస్తుత తెలంగాణ, కొంతవరకు ఆంధ్రప్రదేశ్
చివరి పాలకుడుతానీషా
క్రీ.శ.16 మరియు 17వ శతాబ్దాలలో తెలంగాణను పాలించిన ప్రముఖ రాజవంశంగా కుతుబ్‌షాహీ వంశం ప్రసిద్ధి చెందింది. క్రీ.శ.1512 నుంచి 1687 వరకు సుమారు 175 సంవత్సరాలపాటు ఏడుగురు పాలకులు పాలించారు. హైదరాబాదు నగరమే కాకుండా కుతుబ్‌షాహీలు నిర్మించిన పలు చారిత్రక కట్టడాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. కుతుబ్‌షాహీ పాలన ఉచ్ఛదశలో ఉన్నప్పుడు రాజ్య విస్తరణ ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలో కొంతభాగం, తీరాంధ్రలో కొంతభాగం కూడా భాగంగా ఉండేది. కందుకూరి రుద్రకవి, అద్దంకి గంగాధరుడు, మరింగంటి సింగనాచార్యులు, పొన్నిగంటి తెలగన్న, రామదాసు (కంచెర్ల గోపన్న), సారంగు తమ్మయ, కాసె సర్వప్ప కవులు ఈ కాలం నాటి ప్రముఖ కవులు.

పాలకుల సంఖ్య ఏడు. 1) సుల్తాన్ కులీకుతుబ్ → 1518 నుంచి 1543 2) జంషీద్ కుతుబ్ → 1543 నుంచి 1550 3) ఇబ్రహీం కుతుబ్ షా → 1550 నుంచి 1580 4) మహ్మద్ కుతుబ్ షా → 1580 నుంచి 1612 5) సుల్తాన్ కుతుబ్ షా → 1612నుంచి 1626 6) అబ్దుల్లా కుతుబ్ షా → 1626 నుంచి 1672  7) తానీషా (అబ్దుల్లా హసన్ కుతుబ్ షా) → 1672 నుంచి 1687

కుతుబ్‌షాహీల తొలి పాలకుడు సుల్తాన్ కులీ కుతుబ్ షా దక్కనీ రాజూ సుబేదారుగా ఉంటూ బహమనీల విచ్ఛిన్నం తర్వాత ప్రత్యేకంగా గోల్కొండ రాజ్య స్థాపన చేసి తెలంగాణ కేంద్రంగా తొలి ముస్లిం రాజ్యాన్ని స్థాపించాడు. తొలి పాలకుడిని అతని కుమారుడు జంషీద్ హతమార్చి రెండో పాలకుడిగా అధికారంలోకి వచ్చాడు. జంషీద్ సోదరుడు ఇబ్రహీంకులీ విజయవగర రాజ్యంలో శరణార్థిగా ఆశ్రయం పొంది 1550లో సుల్తాన్ అయి 30 సంవత్సరాలు పాలించాడు. విజయనగరంలో ఆశ్రయం పొంది చివరకు విజయనగర సామ్రాజ్యం పతనానికి జరిగిన రాక్షసతంగిడి యుద్ధంలో పాల్గొన్నాడు. ఈ సంఘటన ఈయనకు మాయని మచ్చలాంటిదని సుంకిరెడ్డి నారాయణరెడ్డి తన "తెలంగాణ చరిత్ర"లో పేర్కొన్నారు. ఇబ్రహీం కుతుబ్ షా తెలుగు కవులను ఆదరించి మల్కిభరాముడు గా పిల్వబడ్డాడు. ఇబ్రహీం కుతుబ్ షా హిందూ వనిత భాగీరథిని ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు. ఇబ్రహీం, భాగీరథిల కుమారుడు మహ్మద్ కుతుబ్ షా 4వ పాలకుడు. ఈయన కూడా హిందూ అమ్మాయి భాగమతిని ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు. భాగమతి పేరిటే భాగ్యనగరమని (ఇప్పటి హైదరాబాదు) పేరువచ్చింది. మహ్మద్ కుతుబ్ షా 1592లో రాజధానిని గోల్కొండ నుంచి హైదరాబాదు (భాగ్యనగరం)కు మార్చాడు. చివరి పాలకుడు అబుల్ హసన్ (తానీషా) 1687లో పాలన చేపట్టాడు. తానీషా మరాఠా చక్రవర్తి శివాజీతో 1677లో సంధి కుదుర్చుకున్నాడు. అక్కన్న మరియు మాదన్న సోదరులను మంత్రులుగా నియమించాడు. 1687లో గోల్కొండ రాజ్యం మొఘలుల వశమైంది. తానీషా పట్టుబడి బందీగా దౌలతాబాదు కోటలో శిక్ష అనుభవిస్తూ మరణించాడు.ఇవి కూడా చూడండి:


హోం
విభాగాలు: తెలంగాణ చరిత్ర, తెలంగాణను పాలించిన రాజవంశాలు, ఆంధ్రప్రదేశ్ చరిత్ర,


 = = = = =


Tags: Qutb SHahi Dynastu, Telangana History, Kutub Shahi, Qutub Shahi,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక