పెద్దపల్లి జిల్లా తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 14 మండలాలు ఉన్నాయి. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు కరీంనగర్ జిల్లాలోనివి. పెద్దపల్లి పట్టణం ఈ జిల్లాకు పరిపాలన కేంద్రంగా ఉంటుంది. రామగుండం జిల్లాలో పెద్ద నగరం మరియు నగరపాలక సంస్థ.
ప్రాచీనకాలం నాటి అవశేషాలు లభ్యమైన పెద్దబొంకూరు, ప్రాచీన బౌద్ధస్తూపం లభించిన వడ్కాపుర్, ధూళికట్ట బౌద్ధస్తూపం, తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే రామగుండం ఈ జిల్లాలో కలవు. భూగోళికం, సరిహద్దులు: పెద్దపల్లి జిల్లాకు ఉత్తరాన మంచిర్యాల జిల్లా, తూర్పున జయశంకర్ భూపాలపల్లి జిల్లా, దక్షిణాన మరియు పశ్చిమాన కరీంనగర్ జిల్లా, వాయువ్యాన జగిత్యాల జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: కాజీపేట - బల్హార్షా రైలుమార్గం జిల్లా మీదుగా వెళ్ళుచున్నది. పెద్దపల్లి నుంచి కరీంనగర్‌కు కొత్త రైలుమార్గం ప్రారంభమైన తర్వాత పెద్దపల్లి రైల్వేజంక్షన్‌గా మారింది. మండలాలు: పెద్దపల్లి, ఓదెల, సుల్తానాబాద్, జూలపల్లి, ఎలిగేడ్, ధర్మారం, రామగుండం, అంతర్గాం, పాలకుర్తి, శ్రీరాంపూర్, కమాన్‌పూర్, రామగిరి, మంథని, ముత్తారం. ఇవి కూడా చూడండి:
= = = = =
ఆధారాలు:
|
Tags: Peddapalli dist in telugu, telugulo peddapalli jilla, peddapalli zilla in telugu, 27 dist in telanagana information in telugu
Superb
రిప్లయితొలగించండి