తిప్పర్తి నల్గొండ జిల్లాకు చెందిన మండలము. భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో మధ్యలో ఉంది. మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు, 22 గ్రామపంచాయతీలు కలవు. బీబీనగర్-నడికూడీ రైలుమార్గం మండలం గుండా వెళ్ళుచున్నది. మండలంలోని మాడుగుల వద్ద టోల్‌గేట్ ఉంది. గాయకుడు సైదులు ఈ మండలం కాజీరామారం గ్రామానికి చెందినవాడు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన నక్రేకల్ మండలం, ఈశాన్యాన కేతెపల్లి మండలం, తూర్పున మరియు దక్షిణాన మాడుగులపల్లి మండలం, పశ్చిమాన నల్గొండ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 45373, 2011 నాటికి జనాభా 1824 పెరిగి 47197 కు చేరింది 2001 జనాభా ప్రకారము జిల్లాలో 31వ స్థానంలో ఉండగా 2011 నాటికి 34వ స్థానానికి దిగజారింది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 47197. ఇందులో పురుషులు 23813, మహిళలు 23384. రవాణా సౌకర్యాలు: నక్రేకల్ నుంచి మిర్యాలగూడ వెళ్ళు రహదారి మరియు బీబీనగర్ నుంచి నడికూడి వెళ్ళు రైలుమార్గం మండలం మీదుగా పోవుచున్నది. మండలంలోని మాడుగుల వద్ద టోల్‌గేట్ ఉంది. తిప్పర్తి మండలంలోని గ్రామాలు: ఇండ్లూరు · ఇందుగల · ఏ.దుప్పలపల్లి · ఎర్రగడ్డలగూడెం · కంకణాలపల్లి · కేశరాజుపల్లి · ఖాజీరామారం · గంగనపాలెం · గడ్డికొండారం · చెరువుపల్లి · జంగారెడ్డిగూడెం · తాండర్‌పల్లి · తిప్పర్తి · దాచారం · పజ్జూరు · మాడుగులపల్లి · మామిడాల · రాజుపేట · సర్వారం · సిలర్మియగూడెం · సూరారం · తిప్పలమ్మ గూడెం తిప్పర్తి మండలంలోని గ్రామపంచాయతీలు: ఏ.దుప్పలపల్లి · చెరువుపల్లి · చిన్నసూరారం · దాచారం · గడ్డికొండాపుర్ · గోదారిగూడెం · ఇంద్లూర్ · ఇందుగుల · జంగంరెడ్డిగూడెం · కంకణాలపల్లి · కొత్తగూడెం · మాడుగులపల్లి · మామిడాల · పజ్జూర్ · రాజుపేట · సర్వారం · సూరారం · తాండర్‌పల్లి · తిప్పర్తి · ఎల్లారెడ్డిగూడెం · ఎర్రగడ్డలగూడెం కాలరేఖ:
= = = = =
|
Tags: Nalgonda Mandals in telugu, Thipparthy Mandal in Telugu, .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి