1, జులై 2016, శుక్రవారం

తిప్పర్తి మండలం (Thipparthy Mandal)

జిల్లానల్గొండ జిల్లా
అసెంబ్లీ నియో.నల్గొండ అ/ని,
లోకసభ నియో.నల్గొండ లో/ని,
జనాభా45373(2001),
47197(2011),
తిప్పర్తి నల్గొండ జిల్లాకు చెందిన మండలము. భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో మధ్యలో ఉంది. మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు, 22 గ్రామపంచాయతీలు కలవు. బీబీనగర్-నడికూడీ రైలుమార్గం మండలం గుండా వెళ్ళుచున్నది. మండలంలోని మాడుగుల వద్ద టోల్‌గేట్ ఉంది. గాయకుడు సైదులు ఈ మండలం కాజీరామారం గ్రామానికి చెందినవాడు.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన నక్రేకల్ మండలం, ఈశాన్యాన కేతెపల్లి మండలం, తూర్పున మరియు దక్షిణాన మాడుగులపల్లి మండలం, పశ్చిమాన నల్గొండ మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 45373, 2011 నాటికి జనాభా 1824 పెరిగి 47197 కు చేరింది 2001 జనాభా ప్రకారము జిల్లాలో 31వ స్థానంలో ఉండగా 2011 నాటికి 34వ స్థానానికి దిగజారింది.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 47197. ఇందులో పురుషులు 23813, మహిళలు 23384.

రవాణా సౌకర్యాలు:
నక్రేకల్ నుంచి మిర్యాలగూడ వెళ్ళు రహదారి మరియు బీబీనగర్ నుంచి నడికూడి వెళ్ళు రైలుమార్గం మండలం మీదుగా పోవుచున్నది. మండలంలోని మాడుగుల వద్ద టోల్‌గేట్ ఉంది.
తిప్పర్తి మండలంలోని గ్రామాలు:
ఇండ్లూరు · ఇందుగల · ఏ.దుప్పలపల్లి · ఎర్రగడ్డలగూడెం · కంకణాలపల్లి · కేశరాజుపల్లి · ఖాజీరామారం · గంగనపాలెం · గడ్డికొండారం · చెరువుపల్లి · జంగారెడ్డిగూడెం · తాండర్‌పల్లి · తిప్పర్తి · దాచారం · పజ్జూరు · మాడుగులపల్లి · మామిడాల · రాజుపేట · సర్వారం · సిలర్మియగూడెం · సూరారం · తిప్పలమ్మ గూడెం

తిప్పర్తి మండలంలోని గ్రామపంచాయతీలు:
ఏ.దుప్పలపల్లి · చెరువుపల్లి · చిన్నసూరారం · దాచారం · గడ్డికొండాపుర్ · గోదారిగూడెం · ఇంద్లూర్ · ఇందుగుల · జంగంరెడ్డిగూడెం · కంకణాలపల్లి · కొత్తగూడెం · మాడుగులపల్లి · మామిడాల · పజ్జూర్ · రాజుపేట · సర్వారం · సూరారం · తాండర్‌పల్లి · తిప్పర్తి · ఎల్లారెడ్డిగూడెం · ఎర్రగడ్డలగూడెం

కాలరేఖ:
 • 2013, ఆగస్టు 16: తిప్పర్తి మండలం మాడ్గులపల్లి వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి.  
 • 2014, నవంబరు 6: వరి కోసే యంత్రం(హార్వెస్టర్)లో చిక్కుకొని ఇద్దరు మరణించారు. 
 • 2015, సెప్టెంబరు 14: తిప్పర్తి మండలం మాడ్గులపల్లి టోల్ గేటు వద్ద కారు, ఆటో, బైకు ఢీకొనడంతో నలుగురు మరణించారు.
 • 2016, మార్చి 3: తిప్పర్తి మండలం పజ్జూరు, ఎర్రగడ్డలగూడెం గ్రామాల మధ్య త్రవ్వకాలలో పురాతనమైన ఆనవాళ్ళు లభించాయి.
 • 2016, మార్చి 16: తిప్పర్తి మండలం పెద్ద సూరారం గ్రామంలోని చెరువులో ''మిషన్ కాకతీయ'' రెండవ దశ పనులకు మంత్రి జగదీష్ రెడ్డి శంఖుస్థాపన చేశారు.విభాగాలు: నల్గొండ జిల్లా మండలాలు, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం,


 = = = = =Tags: Nalgonda Mandals in telugu, Thipparthy Mandal in Telugu, .

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక