నవాబ్‌పేట మండలము వికారాబాదు జిల్లాకు చెందిన 18 మండలాలలో ఒకటి. ఈ మండలం వికారాబాదు రెవెన్యూ డివిజన్, చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. హైదరాబాదు నుంచి వాడి వెళ్ళు రైలుమార్గం మండలం గుండా వెళ్ళుచున్నది. అక్టోబరు 11, 2016 వరకు రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఈ మండలం జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా కొత్తగా ఏర్పడిన వికారాబాదు జిల్లాలో భాగమైంది. ఎల్లంకొండ గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం వికారాబాదు జిల్లాలో తూర్పు వైపున రంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉంది. ఉత్తరాన మోమిన్‌పేట మండలం, దక్షిణాన మరియు పశ్చిమాన వికారాబాదు మండలం, తూర్పున రంగారెడ్డి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 39685. ఇందులో పురుషులు 20242, మహిళలు 19443. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 41199. ఇందులో పురుషులు 20922, మహిళలు 20277. అక్షరాస్యుల సంఖ్య 23328. రాజకీయాలు: ఈ మండలం వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంలో భాగము. 2019 ప్రాదేశిక ఎన్నికలలో ఎంపీపీగా తెరాసకు చెందిన కాలె భవాని ఎన్నికయ్యారు. మండలంలోని గ్రామాలు: అంకాపుర్ (Aknapur), ఆర్కతల (Arkathala), అత్తాపూర్ (Attapur), చించెల్‌పేట్ (Chinchelpet), చిట్టిగుద్ద (Chittigidda), దాతాపూర్ (Dathapur), ఎక్మామిడి (Ekmamidi), గంగెడ (Gangeda), గుబ్బద్ ఫతేపూర్ (Gubbad Fathepur), కడ్‌చర్ల (Kadcharla), కొజ్జవనంపల్లి (Kojjavanampalli), లింగంపల్లి (Lingampalli), మాదారం (Madaram), మాదిరెడ్డిపల్లి (Madireddipalli), మీనపల్లెకలాన్ (Meenapallekalan), ముబారక్‌పూర్ (Mubarakpur), నవాబ్‌పేట్ (Nawabpet), పూలపల్లి (Poolapalli), పులుమామిడి (Pulumamidi), వట్టిమినపల్లి (Vattiminapalli), యావాపూర్ (Yavapur), ఎల్లకొండ (Yellakonda)
ప్రముఖ గ్రామాలు:
ఎల్లంకొండ (Yellmkonda):ఎల్లంకొండ వికారాబాదు జిల్లా నవాబ్‌పేట మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tags: Vikarabad Dist Mandals in Telugu, Vikarabad District Mandals information in Telugu, Telangana Mandals,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి