మోమిన్‌పేట మండలము వికారాబాదు జిల్లాకు చెందిన 18 మండలాలలో ఒకటి. ఈ మండలం వికారాబాదు రెవెన్యూ డివిజన్, వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. వికారాబాదు నుంచి పర్లి వెళ్ళు రైలుమార్గం మండలం గుండా వెళ్ళుచున్నది. రాష్ట్ర బీసి సంఘం అధ్యక్షుడిగా ఉన్న ఆర్.కృష్ణయ్య అక్టోబరు 2021లో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన మున్నూరి లక్ష్మణ్ ఈ మండలమునకు చెందినవారు భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం వికారాబాదు జిల్లాలో ఉత్తరంవైపున సంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉంది. ఉత్తరాన మరియు తూర్పున సంగారెడ్డి జిల్లా, దక్షిణాన నవాబ్‌పేట మండలం, పశ్చిమాన కోట్‌పల్లి మండలం మరియు మర్పల్లి మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 40022. ఇందులో పురుషులు 20247, మహిళలు 19775. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 42851. ఇందులో పురుషులు 21477, మహిళలు 21374. అక్షరాస్యుల సంఖ్య 23598. రాజకీయాలు: ఈ మండలం వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంలో భాగము. 2019 ప్రాదేశిక ఎన్నికలలో ఎంపీపీగా తెరాసకు చెందిన దబ్బని వసంత ఎన్నికయ్యారు. మండలంలోని గ్రామాలు: అమ్రాదికలాన్ (Amradikalan), అమ్రాదిఖుర్ద్ (Amradikhurd), బూరుగుపల్లి (Burugupalli), చక్రంపల్లి (Chakrampalli), చీమల్‌దారి (Cheemaldari), దేవరంపల్లి (Devarampalle), దుర్గంచెరు (Durgamcheru), గోవిందాపుర్ (Govindapur), ఇజ్రచిట్లంపల్లి (Izrachettempalli), కస్లాబాద్ (Kaslabad), కేసారం (Kesaram), కొల్కొండ (Kolkonda), మేకవనంపల్లి (Mekavanampalli), మోమిన్‌పేట్ (Mominpet), మొరంగపల్లి (Morangapalli), రాళ్లగుడుపల్లి (Rallagudpalli), రాంనాథ్‌గుడుపల్లి (Ramnathgudpalli), రావలపల్లి (Ravalapalli), సైదాలిపూర్ (Syedalipur), టేకులపల్లి (Tekulapalli), వెల్చాల్ (Velchal), ఎన్కతల (Yenkathala), ఎంకేపల్లి (Yenkepalli) మండలంలోని ప్రముఖ పట్టణాలు / గ్రామాలు: మోమిన్‌పేట (Mominpet): మోమిన్‌పేట వికారాబాదు జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. మోమిన్ పేట గ్రామం పేరు నిజాం నవాబు ప్రధానమంత్రులలో ఒకరైన మీర్ మోమిన్ పేరిట వెలసింది. అప్పట్లో గ్రామ రక్షణ కోసం 3 బురుజులు కూడా నిర్మించారు. రెండూ బురుజులు నేలమట్టం కాగా మరో బురుజు శిథిలావస్థకు చేరింది. పూర్వం 100 స్తంభాలతో శివాలయం ఉండేదని అది కూల్చబడిందని చెబుతారు. 1959లో అప్పటి హైదరాబాదు జిల్లాలో ఏర్పడిన 11 సమితులలో మోమిన్ పేట కూడా ఒకటి. సమితి మొదటి చైర్మెన్ గా కోట్ మర్పల్లి గ్రామానికి చెందిన లాల్ రెడ్డి పనిచేశారు. మొరంగపల్లి (Morangapalli): మొరంగపల్లి వికారాబాదు జిల్లా మోమిన్‌పేట మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామం సిపాయిల గ్రామంగా ప్రసిద్ధి చెందింది. గ్రామానికి చెందిన పలువులు యువకులు పోలీసుశాఖలో మరియు సైనికులుగా పనిచేస్తున్నారు. కార్గిల్ యుద్ధంలో కూడా ఈ గ్రామానికి చెందిన సైనికులు పాల్గొన్నారు. రాళ్లగుడుపల్లి (Rallagudupalli): రాళ్లగుడుపల్లి వికారాబాదు జిల్లా మోమిన్‌పేట మండలమునకు చెందిన గ్రామము. తెలంగాణ రాష్ట్ర బీసి సంఘంగా ఉన్న ఆర్.కృష్ణయ్య ఈ గ్రామానికి చెందినవారు. వెల్చాల్ (Velchal) : వెల్చాల్ వికారాబాదు జిల్లా మోమిన్‌పేట మండలమునకు చెందిన గ్రామము. గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఆలయ నిర్మాణకర్త గొల్ల పర్మయ్య. ఎవరి సహాయం లేకుండా ఒక్కడే గుహను తొలచి గుహలో నరసింహస్వామి మరియు వెంకటేశ్వరస్వామి విగ్రహాలు ప్రతిష్టించాడు. ఆయనే ఆలయ పూజారిగా ఉంటున్నాడు. అక్టోబరు 2021లో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన మున్నూరి లక్ష్మణ్ ఈ మండలమునకు చెందినవారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tags: Vikarabad Dist Mandals in Telugu, Vikarabad District Mandals information in Telugu, Telangana Mandals,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి