9, అక్టోబర్ 2016, ఆదివారం

వికారాబాదు జిల్లా (Vikarabad District)

కేంద్రస్థానంవికారాబాదు
వైశాల్యం3386 Sq KMs
జనాభా927140
మండలాలు18 + 2 (proposed)
వికారాబాదు జిల్లా తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న ఈ జిల్లా ప్రారంభించారు. గతంలో రంగారెడ్డి జిల్లాలో భాగంగా ఉన్న పశ్చిమ మండలాలు మరియు మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న కోడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాదు మండలాలతో కలిపి ఈ జిల్లా అవతరించింది. ఈ జిల్లాలో వికారాబాదు మరియు తాండూరు రెవెన్యూ డివిజన్లుగా ఉంన్నాయి. వికారాబాదు పట్టణం కొత్త జిల్లాకు పరిపాలన కేంద్రంగా మారింది.

ఈ జిల్లాలో 18 మండలాలు, 2 రెవెన్యూ డివిజన్లు, 3386 చకిమీ విస్తీర్ణం, 927140 జనాభా ఉంది. ఈ జిల్లాపరిధిలో కొత్తగా తాండూరు రెవెన్యూ డివిజన్‌ను మరియు కోట్‌పల్లి మండలాన్ని ఏర్పాటు చేశారు. 
 
డిసెంబరు 31, 2020 నాటి ప్రాథమిక ప్రకటన ప్రకారం ఈ జిల్లాలో మరో 2 మండలాలు (చౌడాపూర్ మండలం మరియు మహమ్మదాబాద్ మండలం) ఏర్పాటుకానున్నాయి. 


సరిహద్దులు:
ఈ జిల్లాకు పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం సరిహద్దుగా ఉండగా దక్షిణాన మహబూబ్‌నగర్ జిల్లా, ఉత్తరాన సంగారెడ్డి జిల్లా, తూర్పున రంగారెడ్డి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

చరిత్ర
కోడంగల్ మరియు తాండూరు ప్రాంతాలు పూర్వం ఇప్పటి కర్ణాటక పరిధిలో గుల్బర్గా జిల్లాలోనూ, వికారాబాదు, పరిగి ప్రాంతాలు అత్రాప్ బల్ద్ జిల్లాలోనే ఉండేవి. 1948లో నిజాం సంస్థానం విమోచన అనంతరం గుల్బర్గా జిల్లా మైసూరు రాష్ట్రంలోకి, అత్రాప్ బల్ద్ జిల్లా హైదరాబాదు రాష్ట్రంలోకి వెళ్ళాయి. 1956లో భాషా ప్రయుల్త రాష్ట్రాల అవతరణతో తెలుగు మాట్లాడే కోడంగల్ ప్రాంతాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలో చేర్చబడింది. 1978లో హైదరాబాదు జిల్లాను విభజించి కొత్తగా రంగారెడ్డి జిల్లా ఏర్పాటుచేయడంతో మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న కోడంగల్, బొంరాస్‌పేట్ మినగా మిగితా మండలాలన్నీ రంగారెడ్డి జిల్లాలోకి చేరాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం అవతరణ అనంతరం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టడంతో 2016లో పశ్చిమ రంగారెడ్డి జిల్లాలోని మండలాలు మరియు మహబూబ్‌నగర్ జిల్లాలోని కోడంగల్, బొంరాస్‌పేట్ మండలాలు వికారాబాదు జిల్లాలో భాగమయ్యాయి. అక్టోబరు 11, 2016న అధికారికంగా వికారాబాదు జిల్లా అవతరించింది.

మండలాలు
వికారాబాదు జిల్లాలోని మండలాలు: మర్పల్లి, మోమిన్‌పేట్, నవాబ్‌పేట్, వికారాబాద్, పూడూరు, కుల్కచర్ల, దోమ, పరిగి, ధరూర్, కోట్‌పల్లి, బంట్వారం, పెద్దెముల్, యాలాల, కోడంగల్, బొంరాస్‌పేట్, దౌల్తాబాద్, బషీరాబాద్, తాండూరు.

రవాణా సౌకర్యాలు
రైలురవాణా
హైదరాబాదు నుంచి వాడి వెళ్ళు రైలుమార్గం మరియు వికారాబాదు నుంచి పర్లి వెళ్ళు రైలుమార్గాలు జిల్లా గుండా వెళ్తున్నాయి. తాండూరు మరియు వికారాబాదులు ప్రధాన రైల్వే స్టేషన్లు కాగా వికారాబాదు జంక్షన్‌గా ఉంది.
రోడ్డురవాణా
హైదరాబాదు నుంచి బీజాపూర్ వెళ్ళు రాష్ట్ర రహదారి జిల్లా గుండా వెళ్తుంది. వికారాబాదు నుంచి తాండూరు, పరిగి, చేవెళ్ళ పట్టణాలకు రవాణాసౌకర్యాలు చక్కగా ఉన్నాయి. కోడంగల్‌కు తాండూరు మరియు మహబూబ్‌నగర్ పట్టణాల నుంచి రవాణా సౌకర్యాలు ఉన్నాయి.

పర్యాటకప్రాంతాలు
వికారాబాదుకు సమీపంలో ఉన్న అనంతగిరి పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చెందింది. మూసీనది జన్మస్థానమైన అనంతగిరి వద్ద శ్రీఅనంత పద్మనాభస్వామి దేవాలయం ఉంది. తాండూరులో శ్రీభావిగి భద్రేశ్వరస్వామి ఆలయం, తాండూరు సమీపంలో అంతారం, కొత్లాపూర్ లలో ఆకట్టుకొనే దేవాలయాలు ఉన్నాయి. చేవెళ్ళలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ప్రసిద్ధిచెందింది. కోట్‌పల్లి ప్రాజెక్టు కూడా పర్యాటక ప్రాంతంగా ఉంది.

ఇవి కూడా చూడండి:


ఫోటో గ్యాలరీ




విభాగాలు: తెలంగాణ జిల్లాలు, వికారాబాదు జిల్లా,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక