మునుగోడు నల్గొండ జిల్లాకు చెందిన మండలము. ఇది నల్గొండ రెవెన్యూ డివిజన్, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగము. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ విమోచనోద్యమ పోరాటయోధుడు బొమ్మగాని ధర్మభిక్షం, కొండవీటి ఈ మండలమునకు చెందినవారు. మండలంలో 22 రెవెన్యూ గ్రామాలు, 21 గ్రామపంచాయతీలు కలవు. 2012లో కేంద్రప్రభుత్వ పురస్కారానికి రాష్ట్రం నుంచి పంపిన 6 మండలాలలో ఇది ఒకటి. అభివృద్ధి పథకాల అమలులో ఇది ఆరింటిలో ప్రథమస్థానంలో నిలిచింది.
సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన చిట్యాల మండలం, తూర్పున నల్గొండ మండలం, దక్షిణాన చండూర్ మండలం, పశ్చిమాన భువనగిరి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 41610. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 45836. ఇందులో పురుషులు 23462, మహిళలు 22374. రాజకీయాలు: ఈమండలము మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. తెలంగాణ సాయుధ పోరాటయోధుడు, రాజకీయనాయకుడు బొమ్మగాని ధర్మభిక్షం ఈ మండలమునకు చెందినవారు. మండలంలోని గ్రామాలు: Chalimeda, Cheekatimamidi, Cholledu, Gudapur, Ipparthy, Jamastanpally, Kachalapoor, Kalvakuntla, Kalvalapally, Kistapoor, Kompally, Koratikal, Kothularam, Marriguda, Munugode, Palivela, Pulipalupula, Rathpally, Singaram, Solipoor, Velmakanne, Vookondi
ముఖ్యమైన గ్రామాలు:
పలివెల (Palivela):నిజాం విమోచన ఉద్యమకారులు కొండవీటి గుర్నాథరెడ్డి, కొండవీటి సత్తిరెడ్డి, కొండవీటి రామలింగారెడ్డి ఈ గ్రామస్థులు. కొండవీటి గుర్నాథరెడ్డి గ్రామ సర్పంచిగా, చినకొండూరు ఎమ్మెల్యేగా (1962) ఎన్నికయ్యారు. ఊకొండి (Vookondi): ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ విమోచన పోరాటయోధుడు బొమ్మగాని ధర్మభిక్షం ఈ గ్రామంలో 1922 ఫిబ్రవరి 15న జన్మించారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
tags: Munugode Mandal in telugu, Nalgonda Dist Mandals in telugu, Bommagani Dharmabhiksham,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి