కొత్తూరు రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలము. మండలం గుండా సికింద్రాబాదు - డోన్ రైల్వేలైన్ వెళ్ళుచున్నది. మండల కేంద్రం కొత్తూరు మరియు తిమ్మాపూర్ లలో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఈ మండలము షాద్‌నగర్ రెవెన్యూ డివిజన్, షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు, 17 గ్రామపంచాయతీలు కలవు. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 65199. మండల పరిధిలోని మామిడిపల్లిలో పురాతనమైన కోదండరామస్వామి ఆలయం, ఇన్ముల్‌నర్వలో జహంగీర్ పీర్ దర్గా ఉన్నాయి.
మండల సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన మరియు తూర్పున శంషాబాద్ మండలం, దక్షిణాన మరియు పశ్చిమాన నందిగామ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 56127. ఇందులో పురుషులు 29151, మహిళలు 26976. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 65199. ఇందులో పురుషులు 33957, మహిళలు 31242. పట్టణ జనాభా 10520, గ్రామీణ జనాభా 54679. జనాభాలో ఇది జిల్లాలో 20వ స్థానంలో ఉంది. స్త్రీపురుష నిష్పత్తిలో (920/వెయ్యి పురుషులకు) ఈ మండలం జిల్లాలో చివరి స్థానంలో ఉంది. రవాణా సౌకర్యాలు: సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం మండలం నుంచి వెళ్ళుచున్నది. తిమ్మాపూర్ మరియు కొత్తూర్ లలో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. 44వ నెంబరు జాతీయరహదారి కూడా మండలం నుంచి వెళ్ళుచున్నది. హైదరాబాదుకు సమీపంలో ఉండుటచే రవాణాసౌకర్యాలు మెండుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలము షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2001 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన మామిడి శ్యాంసుందర్ రెడ్డి, 2006 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన చిర్ర మల్లయ్య విజయం సాధించారు.
2008-09 నాటికి మండలంలో 56 ప్రాథమిక పాఠశాలలు (50 మండల పరిషత్తు, 1 ప్రైవేట్ ఎయిడెడ్, 5 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 18 ప్రాథమికోన్నత పాఠశాలలు (7 మండల పరిషత్తు, 11 ప్రైవేట్), 13 ఉన్నత పాఠశాలలు (9 జడ్పీ, 1 ప్రైవేట్ ఎయిడెడ్, 3 ప్రైవేట్ అన్-ఎయిడెడ్) ఉన్నవి. వ్యవసాయం, నీటిపారుదల: మండలం మొత్తం విస్తీర్ణం 18760 హెక్టార్లలో 36% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట మొక్కజొన్న. కందులు, జొన్నలు, వరి, ప్రత్తి కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 639 మిమీ. మండలంలో సుమారు 1700 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది. కాలరేఖ:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tags:Kothur Mandal in telugu, rangareddy Dist Mandals information in telugu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి