19, మే 2013, ఆదివారం

నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)

 నారా చంద్రబాబు నాయుడు
జననం1950, ఏప్రిల్ 20
స్వస్థలంనారావారిపల్లె (చిత్తూరు జిల్లా)
పదవులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (1995-2004 & 2014-)
నియోజకవర్గంకుప్పం (చిత్తూరు జిల్లా)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించిన నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో నారావారిపల్లె గ్రామంలో 1950, ఏప్రిల్ 20వ తేదీన ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. తొమ్మిదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా పనిచేసి పదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించి జూన్ 8, 2014న విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. చంద్రబాబు అనేక పర్యాయాలు దేశరాజకీయాలలో చక్రం తిప్పి తనదైన ఉనికిని చాటిచెప్పారు. సమితి స్థాయిలో యువజన అద్యక్షపదవితో రాజకీయజీవితం ఆరంభించి అంచెలంచెలుగా ఎదిగి శాసనసభ్యుడిగా, తొలిసారిగా టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో స్థానం పొంది తదుపరి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించే వరకు చంద్రబాబు జీవితంలో ఎన్నో ఆటుపోట్లు సంభవించాయి. తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు 1982లో ఎన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమయంలో కాంగ్రెస్ పార్టీ సభ్యుడుగానే ఉన్నారు. మామ ఎన్టీయార్‌ను విమర్శించి కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం జయభేరి మ్రోగించాక తెలుగుదేశం పార్టీ లోకి చేరినాడు. 1994 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ విజయం సాధించి ఎన్టీరామారావు ముఖ్యమంత్రి అయిన పిదప లక్ష్మీపార్వతి జోక్యం పెరగడంతో పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీరామారావునే అధికారం నుంచి దించి పీఠం ఎక్కడం చంద్రబాబు రాజకీయ చాతుర్యం దేశ రాజకీయాలలోనే సంచలనం కలిగించింది. 2012-13లో "వస్తున్నా...మీకోసం" అంటూ హిందూపురం నుంచి విశాఖపట్టణం వరకు 208 రోజులపాటు 2817 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు.

బాల్యం, విద్యాభ్యాసం:
1950లో అమ్మణమ్మ, ఖర్జూరనాయుడు దంపతులకు పెద్ద కుమారుడిగా జన్మించిన చంద్రబాబు నాయుడు శేషాపురంలో ప్రాథమిక విద్య, చంద్రగిరిలో ఉన్నత విద్యను పూర్తిచేశారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఆర్థికశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. చిన్నప్పటి నుండి ప్రజాసేవ పట్ల అత్యంత ఆసక్తి కలిగి ఉండేవారు. తొలుత ప్రభుత్వ ఉద్యోగం చేయాలని భావించిననూ ప్రజాసేవ చేయడానికి రాజకీయాలే సరైనవని నిర్థారించి రాజకీయాలపై దృష్టిపెట్టారు. విద్యాభ్యాసం పూర్తి కాకముందే కాంగ్రెస్ పార్టీలో చేరినారు. చదువుతున్నప్పుడే సెలవులలో స్నేహితులను కూడగట్టుకుని గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టి పలువురి ప్రశంసలందుకున్నారు.

రాజకీయ జీవితం
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ప్రతిభ రాజకీయ వ్యుహచతురత బయటపడింది. తరువాత శాసనమండలి ఎన్నికలలో పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీచేయాలని ఆసక్తి చూపి నామినేషన్ వేసిననూ స్థానిక నేతల కారణంగా విరమించుకోవలసి వచ్చింది. ఆ తరువాత చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కొంతకాలం రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‍గా పనిచేశాడు. 1980 నుండి 1983 వరకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశు సంవర్థకశాఖ, పాడి పరిశ్రమ, చిన్నతరహా నీటిపారుదల శాఖా మంత్రిగా పని చేశారు.

కాంగ్రెస్ మంత్రివర్గంలో ఉన్నప్పుడే ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరామారావు కుమార్తె అయిన భువనేశ్వరీ దేవిని 1981, సెప్టెంబర్ 10వ తేదీన వివాహం చేసుకున్నారు. 1983లో ఎన్.టి.ఆర్. రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటికీ చంద్రబాబు నాయుడు అందులో చేరలేరు. పార్టీ అదేశిస్తే మామపై పోటీకి సిద్దం అంటూ ప్రకటించి, అందరినీ ఆశ్చర్యపరచారు. కానీ తరువాత కాలంలో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయంగా ఉన్నతస్థాయికి ఎదిగి పలు సంచలనాలకు కేంద్రబిందువయ్యారు. 1985 వరకు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేశారు. 1989వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడంతో నందమూరి తారక రామారావు, ముఖ్యమంత్రిగా తప్ప ప్రతిపక్ష నాయకునిగా శాసనసభలో అడుగు పెట్టనని 'ప్రతిజ్ఞ' చేయడంతో చంద్రబాబు నాయుడు శాసనసభలో తెలుగుదేశం తరుపున ప్రతిపక్షనాయకునిగా వ్యవరించారు. ఆ అవకాశం పార్టీపై పట్టు పెంచుకోవడానికి చంద్రబాబు నాయుడికి చాల బాగా ఉపయోగపడింది.

1994వ సంవత్సరంలో తెలుగుదేశం భారీ విజయం సాధించి అధికారాన్ని సొంతం చేసుకుంది. అప్పుడు ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అప్పుడు జరిగిన ఎన్నికలలో కుప్పం నుండి ఎన్నికై ప్రభుత్వంలో ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా చంద్రబాబు నాయుడు పని చేసారు. 1995వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటి నుండి 2004వ సంవత్సరం వరకు ముఖ్యమంత్రిగా కొనసాగి, అత్యధిక కాలం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా రికార్డు సృష్టించారు. 2003వ సంవత్సరంలో తిరుపతి బ్రహ్మొత్సవాలకు వెళుతున్న సమయంలో అలిపిరి వద్ద నక్సలైట్లు క్లేమోర్ మైన్లు పేల్చి చంద్రబాబు నాయుడిపై హత్యాప్రయత్నం చేశారు. కానీ అదృష్టవశాత్తూ చంద్రబాబు ఆ ప్రమాదం నుండి గాయాలతో బయటపడ్డాడు. తర్వాత జరిగిన మద్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. అప్పటి నుంచి చంద్రబాబు ప్రతిపక్షనాయకుడిగా వ్యవహరిస్తున్నారు. 2012-13లో "వస్తున్నా...మీకోసం" అంటూ హిందూపురం నుంచి విశాఖపట్టణం వరకు 208 రోజులపాటు 2817 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. 2013 మే 29న చంద్రబాబు వరుసగా 9వ సారి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2014 శాసనసభ ఎన్నికలలో మరోసారి కుప్పం నుంచి గెలుపొంది జూన్ 8, 2014న విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఐదేళ్ళు పాలించి ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. కుమారుడు నారా లోకేష్ కూడా రాజకీయాలలో చేరి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.

పరిపాలన విధానాలు:
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు జన్మభూమి, నీరు-మీరు, దీపం, శ్రమదానం, పచ్చదనం-పరిశుభ్రత వంటి పలు విభిన్నమైన కార్యక్రమాలతో పరిపాలనా విధానాలలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ" సహకారంతో ఆంధ్ర ప్రదేశ్‍ను ఆధునికదిశగా అడుగు వేయించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో చంద్రబాబు నాయుడు కృషికి బిల్‍క్లింటన్, బిల్‍గేట్స్ వంటివారి ప్రశంసలు అందుకున్నారు. దేశ రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు కొంతకాలంపాటు కీలకపాత్ర పోషించాడు. హైదరాబాదును ముఖ్యంగా సైబరాబాదును(హైటెక్ సిటి) ఎంతో అభివృద్ధిపర్చారు. సాంకేతికరంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి హైటెక్ ముఖ్యమంత్రిగా పేరుతెచ్చుకున్నారు.

ఇవి కూడా చూడండి:

హోం,
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, చిత్తూరు జిల్లా ప్రముఖులు, 6వ శాసనసభ సభ్యులు, 9వ శాసనసభ సభ్యులు, 10వ శాసనసభ సభ్యులు, 11వ శాసనసభ సభ్యులు, 12వ శాసనసభ సభ్యులు, 13వ శాసనసభ సభ్యులు, 14వ శాసనసభ సభ్యులు,


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక