20, మార్చి 2013, బుధవారం

ఎడ్మకిష్టారెడ్డి (Edma Kista Reddy)

ఎడ్మకిష్టారెడ్డి మార్చి 22, 1947న జన్మించారు. పీయుసి వరకు విద్యనభ్యసించి, 1967లో సంయుక్త సోషలిస్టు పార్టీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేశారు. మాజీ గవర్నర్ సత్యనారాయణ రెడ్డి ఇతని రాజకీయ గురువు. 1970లో కల్వకుర్తి మేజర్ గ్రామపంచాయతి వార్డు సభ్యునిగా ఎన్నికై, 1973లో సర్పంచ్ అయ్యారు. 1975 అత్యవసర పరిస్థితి కాలంలో జైలుకు వెళ్ళారు. ఏడాది పాటు చంచల్ గూడ జైలులో గడిపారు. 1981లో మరోసారి కల్వకుర్తి సర్పంచిగా పనిచేశారు. 1986లో కల్వకుర్తి ఎంపిపిగా, 1994లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పాటీచేసి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1998లో కాంగ్రెస్ పార్టీలో చేరి, 2004లో కాంగ్రెస్ తరఫున రెండోసారి కల్వకుర్తి నుంచే ఎమ్మెల్యే అయ్యారు. . 2004 ఎన్నికలకు ముందు రైతులకు 9 గంటల విద్యుత్ సరఫరా చేయాలని కల్వకుర్తిలో 8 రోజులపాటు ఆమరణ నిరాహారదీక్ష చేశారు. 2009లో ఓడిపోయారు. ఆ తర్వాత వైఎస్సార్ పార్టీలో చేరి జిల్లా కన్వీనర్‌గా నియమితులయ్యారు. 2014, ఫిబ్రవరిలో వైకాపా జిల్లా అధ్యక్షుడిగా నియమించబడ్డారు.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులు,  కల్వకుర్తి మండలము,  కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం,    

= = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక