1, మే 2015, శుక్రవారం

ఏటూరు నాగారం మండలం (Etur Nagaram Mandal)

జిల్లాజయశంకర్ జిల్లా
జనాభా41046 (2011),
అసెంబ్లీ నియో.ములుగు అ/ని,
లోకసభ నియో.మహబూబాబాద్ లో/ని,
ఏటూరు నాగారం జయశంకర్ జిల్లాకు చెందిన మండలము. ప్రతిపాదిత దేవాదుల ప్రాజెక్టు మండలంలోని గంగారాం గ్రామం వద్ద ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ ఏటూరు నాగారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. హైదరాబాదు-భూపాలపల్లి జాతీయ రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు, 19 గ్రామపంచాయతీలు, 53 రెవెన్యూ గ్రామాలు కలవు. ఏటూరునాగరంలో ఐటిడిఏ కార్యాలయం ఉంది. ఉమ్మడి సీబీఐ డైరెక్టరుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కె.విజయరామారావు ఏటూరు నాగారంలో జన్మించారు.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఆగ్నేయాన మంగపేట మండలం, దక్షిణాన మరియు నైరుతిన తాడ్వాయి మండలం, వాయువ్యాన ముత్తారం మహాదేవ్‌పూర్ మండలం, తూర్పున భద్రాద్రి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలంలో దట్టమైన అడవులున్నాయి. ఇది ఏటూరు నాగారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో భాగము. తూర్పు సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తుంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 37153. ఇందులో పురుషులు 19015, మహిళలు 18138.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 41046. ఇందులో పురుషులు 20264, మహిళలు 20782.

ఏటూరు నాగారం అడవులు
రాజకీయాలు:
ఈ మండలము ములుగు అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.

నీటిపారుదల:
గోదావరినది తీరాన ఉండటం, పలు చిన్న వాగులు, చెరువులు ఉండటంతో నీటిపారుదల బాగుగా ఉంది. కాని మండలంలో అడవులు అధికంగా ఉన్నందున సాగుయోగ్యం కాని భూమి అధికంగా ఉంది. ఎల్లమ్మకుంట, బోయి చెరువు, బొజ్జెరెవాగు చెరువు, మారేడువాయి కుంట లాంటి చెరువులు మిషన్ కాకతీయలో భాగంగా పునరుద్ధరిస్తున్నారు.

మండలంలోని గ్రామలు:
అల్లంవారిఘనపురం · ఆకులవరిఘన్‌పూర్ · ఎక్కెల · ఎటూరునాగారం · ఎలిశెట్టిపల్లి · ఏటూరు · ఐలాపూర్ · కంతన్‌పల్లి · కన్నాయిగూడెం · కొండాయి · గంగారం (గుట్టల) · గంగుగూడెం · గుర్రేవుల · గోగుబెల్లి · చాల్పాక · చింతగూడెం · చిట్యాల · చినబోయినపల్లి · తుపాకులగూడెం · దేవదూముల · దొడ్ల · పాప్కాపురం · పెద్దవెంకటాపూర్ · బానాజీబంధం · బుట్టాయిగూడెం · బుట్టారం · భూపతిపురం · మల్యాల · ముప్పనపల్లి · ముళ్ళకట్ట · రాంనగర్ (కోయగూడెం) · రాంపూర్అగ్రహారం · రాజన్నపేట్ · రామన్నగూడెం · రొహీర్ · లక్ష్మీపురం · శంకరాజ్‌పల్లి · శివపురం · షాపల్లి · సర్వాయి · సింగారం (పత్తిగొర్రేవుల)


విభాగాలు: జయశంకర్ జిల్లా మండలాలు, ఏటూరు నాగారం మండలం, ములుగు అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గం,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక