2, మార్చి 2013, శనివారం

జె.కుముదినీ దేవి (J.Kumudini Devi)

జానంపల్లి కుముదినీ దేవి 1911 జనవరి 23న వరంగల్లు జిల్లా వాడపల్లి చెందిన జమీందారీ వంశంలో జన్మించారు. వనపర్తి సంస్థానపు రాణిగా, రాజకీయ నాయకురాలుగా, హైదరాబాదు తొలి మహిళా మేయరుగా, సంఘసేవికరాలుగా ఈమె ప్రసిద్ధులు. కుముదినీ దేవి ఈమె తండ్రి పింగళి వెంకటరమణారెడ్డి హైదరాబాదు రాజ్యానికి ఉపప్రధానిగా పనిచేశారు. 1928లో వనపర్తి రాజా రామదేవరావుతో కుముదినీ దేవికి వివాహమైంది. కుముదినీ దేవి శివానంద స్వామిచే ప్రభావితురాలై కూకట్‍పల్లిలో శివానంద ఆశ్రమం స్థాపించారు. కుష్టు వ్యాధి గలవారి చికిత్స, పునరావాసం వంటి విషయాలలో ఈ సంస్థ నేటికీ ఎంతో కృషి చేస్తోంది. అంతేకాక, 1958లో కుముదిని వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరుగా ఉంటూ నెలకొల్పబడిన “సేవాసమాజ బాలికా నిలయం” ఇప్పటికీ విజయవంతంగా నడుస్తూ, ఎందరో ఆడపిల్లలకి ఉపాధి, ఆశ్రయం కల్పిస్తోంది. మోటారు వాహనము మరియు గుర్రపుస్వారీ చేసిన ప్రథమ మహిళలలో ఈమె ఒకరు. 1962లో హైదరాబాదు నగర మేయరుగా ఎన్నికైనారు. వనపర్తి నియోజకవర్గం నుంచి కూడా రెండు సార్లు విజయం సాధించారు.

ఇవి కూడా చూడండి:
  • వనపర్తి సంస్థానం,

విభాగాలు: వనపర్తి జిల్లా ప్రముఖులు,  వనపర్తి మండలము,  వనపర్తి సంస్థానము,  వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక