3, మార్చి 2013, ఆదివారం

పాకాల యశోదారెడ్డి (Pakala Yashoda Reddy)

 
పాకాల యశోదారెడ్డి
జననంఆగస్టు 8, 1929
రంగంరచయిత్రి
స్వస్థలంబిజినేపల్లి
మరణంఅక్టోబరు 7, 2007
పాకాల యశోదారెడ్డి పాలమూరు జిల్లాకు చెందిన (ప్రస్తుతం నాగర్‌కర్నూల్ జిల్లా) కవియిత్రి. బిజినేపల్లి గ్రామానికి చెందిన యశోదారెడ్డి ఆగస్టు 8, 1929న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగు, సంస్కృతంలో ఎంఏ డిగ్రీలు పొంది 1955లో లెక్చరర్ వృత్తిలో ప్రవేశించి ప్రొఫెసర్ గా పదవీవిరమణ పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి "తెలుగులో హరివంశాలు" అంశంపై పరిశోధన చేసి పీహెచ్‌డి పొందారు. 1990-93 కాలంలో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా పనిచేశారు. ఆగ్రా విశ్వవిద్యాలయంచే గౌరవ డాక్టరేట్ పొందినారు. మా ఊరి ముచ్చట్లు, తెలుగులో హరివంశము, భాగవత సుధ, నారదీయం వీరి రచనలలో ప్రముఖమైనవి. ఈమె భర్త పాకాల తిరుమల రెడ్డి చిత్రకళా రంగంలో పేరుగాంచారు. యశోధారెడ్డి అక్టోబరు 7, 2007న మరణించారు.

బాల్యం, విద్యాభ్యాసం:
ఆగస్టు 8, 1929న నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలకేంద్రంలో జన్మించిన పాకాల యశోధారెడ్డి స్థానికంగానే ప్రాథమిక విద్య అభ్యసించి, రావు బహద్దూర్ వెంకట్రామిరెడ్డి ప్రోత్సాహంతో కళాశాల విద్య కొనసాగించి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో పి.హెచ్.డీ.తో పాటు అలీఘర్ విశ్వవిద్యాలయం నుండి డి.లిట్ అందుకున్నారు. యశోదారెడ్దికి హిందీ, ఉర్దూ, కన్నడ భాషల్లో ప్రావీణ్యంతో పాటు, జర్మన్ భాషతో కూడా పరిచయమున్నది. జర్మన్ భాషలో డిప్లొమా కూడా పూర్తిచేశారు.

రచయిత్రిగా:
కోఠీ మహిళా కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా, ఆ తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేస్తూనే పాకాల యశోధారెడ్డి రచనలు కొనసాగించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డి కొరకు "తెలుగులో హరివంశాలు" అంశంపై పరిశోధన పత్రం సమర్పించారు. మొత్తం వందకు పైగా కథలు వ్రాసినా వాటిలో 63 మాత్రమే పుస్తక రూపంలో వచ్చాయి. ఈమె ప్రచురించిన మూడు కథా సంపుటాల్లో, మావూరి ముచ్చట్లు (1973) కథా సంపుటి 1920-40 నాటి తెలంగాణ గ్రామీణ జీవన విధానాన్ని చిత్రీకరిస్తే, ఎచ్చమ్మ కథలు (1999) 1950-70 నాటి తెలంగాణ సంస్కృతికి ప్రతీకలు, ధర్మశాల (2000) కథా సంపుటి 1980-1990 నాటికి తెలంగాణ సమాజంలో వచ్చిన మార్పులకు దర్పణం పట్టింది. ఈ మూడు కథా సంపుటాల్లో ఈమె తెలంగాణ భాషను, యాసను, సంస్కృతిని మరియు సామాజిక జీవితాన్నిఅక్షర బద్ధం చేసింది. మావూరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, పాలమూరు జిల్లా మాండలికంలో వ్రాస్తే, ధర్మశాల కథా సంపుటిని మాత్రం వ్యవహారిక తెలుగు భాషలో వ్రాసారు.

ఇవి కూడా చూడండి:


హోం,
విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రచయితలుబిజినేపల్లి మండలము, 1929లో జన్మించినవారు, 2007లో మరణించినవారు,  


 = = = = =


4 కామెంట్‌లు:

  1. నేను వుస్మానియా విశ్వ విద్యాలయంలో పి‌జి కాలేజీ బషీర్బాగ్ లో 1979-81 వరకు maతెలుగు చదివినప్పుడు మా గురువుగారు యశోధా రెడ్డి గారు.అందరితో కలసి మంచిగా మాట్లాడేది .పాఠాలు బాగా చెప్పేది .పిల్లలంటే ప్రేమ .ymca దగర వాళ్ళింటి వెళ్ళాం.పెద్ద ఇల్లు .మొత్తం తిరిగి చూపించింది .సిర్ వేసిన చిత్రాలు చూపించిని .అప్పుడు మాకు సెమిస్టర్ పధ్హతి వుండేది .తెలుగు తెనుగు ఆంధ్రం వీటి గురించి చెప్పింది.యాత్రా చరితాలు చెప్పేది.మా గురువు గా వుండడం మా అదృష్టం .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నమస్కారం మేడం
      యశోదా రెడ్డి గారు మీకు గురువుగారా!.. చాలా సంతోషంగా ఉంది నాకు మీకు ఈ ప్రత్యుత్తరం చేస్తున్నందుకు. నాకు యశోదా రెడ్డి గారి ఉపన్యాసం వినాలని ఉంది. ఇంటర్ నెట్ లో వెదికినా ఫలితం రావటం లేదు. మీరైనా నాకు సహాయం చేయగలరు..

      తొలగించండి
  2. రేపు జయంతిని జరుపుకుంటాము
    తెలుగు వెలుగు సాహిత్య వేదిక

    రిప్లయితొలగించండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక