21, మార్చి 2013, గురువారం

జే.రామేశ్వర్ రావు (J.Rameshwar Rao)

జననంఫిబ్రవరి 6, 1923
పదవులుదౌత్యవేత్త, 4 సార్లు ఎంపి,
నియోజకవర్గంమహబూబ్‌నగర్ లో/ని,
మరణంసెప్టెంబర్ 15, 1998
జునుంపల్లి రామేశ్వరరావు ఫిబ్రవరి 6, 1923న జన్మించారు. 1944లో 21 యేళ్ళ వయసులో వనపర్తి సంస్థానాధీశుడైన రాజా జే.రామేశ్వర్ రావు స్వాతంత్ర్యానంతరం దౌత్యవేత్తగా మరియు లోకసభ సభ్యుడిగానూ పనిచేశారు. ఈయన తండ్రి రాజా కృష్ణదేవరావు, తల్లి రాణీ సరళాదేవి. తల్లిపేరిట అత్యధునిక సైఫన్ టెక్నాలజీతో సరళాసాగర్ ప్రాజెక్టును నిర్మింపచేశాడు.

రామేశ్వరరావు 1949లో ఇండియన్ ఫారిన్ సర్వీసులో చేరి 1950-52ల మధ్య నైరోబిలో ప్రథమ భారతీయ రాయబారిగా, 1953 నుండి 1956 వరకు గోల్డ్‌కోస్ట్ (ఘనా) మరియు నైజీరియాలకు భారత రాయబారిగా పనిచేశారు. రామేశ్వరరావు వ్యవసాయము, సాగునీటి అభివృద్ధికి కూడా కృషిచేశారు. తన తల్లి సరళాదేవి పేరిట సరళాసాగర్ ప్రాజెక్టును నిర్మింపజేశారు. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించిన రామేశ్వరరవు 1958లో ఐక్యరాజ్యసమితికి భారతీయ బృందంలో, 1960-61లో ఐక్యరాజ్యసమితి కాంగో కన్సీలియేషన్ కమిషన్‌లో, 1964-65లో అల్జీర్స్‌లో జరిగిన ఆఫ్రో-ఆసియా సదస్సులో సభ్యునిగా వెళ్లారు. రామేశ్వరరావు 2వ, 4వ, 5వ మరియు 6వ లోక్‌సభలకు మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెసు పార్టీ అభ్యర్ధిగా మూడుసార్లు ఎన్నికై పార్లమెంటు విదేశాంగ వ్యవహారాల సలహా సంఘంలోనూ, ప్రణాళికా సలహా సంఘంలోనూ సభ్యుడిగా పనిచేశాడు. సెప్టెంబర్ 15, 1998న 75 ఏళ్ల వయసులో రామేశ్వరరావు మరణించారు.

ఇవి కూడా చూడండి:


హోం
విభాగాలు:  వనపర్తి జిల్లా ప్రముఖులు,  వనపర్తి సంస్థానం,  మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక