కొత్తకోట మండలంలో ఆత్మకూరు మండల సరిహద్దులో 1972లో సాగునీటి అవసరాల కోసం రామన్‌పాడు జలాశయం నిర్మించారు. 1997లో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు అనుసంధానం చేయడంతో బ్యాలెన్సింగ్ రిజర్వాయరుగా మారింది. పునరుద్ధరణలో భాగంగా 19 క్రస్ట్ గేట్లను అమర్చారు. ప్రస్తుతం ఇది జిల్లా ప్రజల దాహార్తిని తీర్చే వరప్రదాయినిగా మారింది. మహబూబ్‌నగర్, వనపర్తి, జడ్చర్ల, కొత్తకోట, అచ్చంపేట తదితర 40 పట్టణ మరియు గ్రామప్రజలకు త్రాగునీటిని ఇక్కడి నుంచే అందిస్తున్నారు. త్రాగునీరే కాకుండా రామన్‌పాడ్ కుడికాలువ ద్వారా ఆత్మకూరు మండలంలో, ఎడమ కాలువ ద్వారా కొత్తకోట, పెబ్బేరు మండలాలలో వేల సాగునీటిని అందిస్తున్నారు.
విభాగాలు: పాలమూరు జిల్లా ప్రాజెక్టులు, కొత్తకోట మండలము, |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి