జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం వేణీసోంపూర్ గ్రామంలో తుంగభద్ర నది తీరాన పురాతనమైన శ్రీవేణుగోపాలస్వామి ఆలయం నెలకొనిఉంది. 7 శతాబ్దాల క్రితం మంత్రాలయ రాఘవేంద్రస్వామి శిష్యుడైన భువనేంద్రతీర్థులు తుంగభద్ర తీరాన కృష్ణస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. నదీతీరాన భువనేంద్రతీర్థులు సంచరిస్తుండగా, విశ్రాంతి చెందినప్పుడు స్వామివారు కలలోకి వచ్చి ఇటిక్యాల మండలం వల్లూరు వద్ద త్రవ్వితే విగ్రహం లభిస్తుందని చెప్పి అంతర్థానమయ్యారు. స్వామివారి ఆదేశం ప్రకారం వల్లూరులో త్రవ్వగా కుడికాలుపై ఎడమ కాలు వేసుకున్న విగ్రహం లభించగా ఆ విగ్రహాన్ని వేణీసోంపూర్‌లో ప్రతిష్టించారు. సంతానం లేనివారు ఇక్కడి స్వామిని పూజిస్తే సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఈ కారణంతో ఇక్కడి స్వామివారిని సంతాన వేణుగోపాలస్వామి అని కూడా పిలుస్తారు.
ఆలయ ప్రత్యేకత:
సాధారణంగా కృష్ణుని విగ్రహాలు ఎడమ కాలిపై కుడికాలు వేసుకొని ఉంటాయి. కాని ఇక్కడ మాత్రం దీనికి భిన్నంగా కుడికాలిపై ఎడమ కాలు వేసుకున్నట్లు ఉంది. ఇదే ఈ ఆలయ ప్రత్యేకత. స్వామివారి విగ్రహం చేతిలో వేణువు పట్టుకొన్నట్లు కూడా ఉంది.

విభాగాలు: పాలమూరు జిల్లా దేవాలయాలు, ఐజ మండలము, |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి