పాలమూరు జిల్లా అయిజ మండలం ఉత్తనూరులో పురాతనమైన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. కర్ణాటక సరిహద్దులో ఉండటంతో స్వామివారిని జిల్లా ప్రజలతో పాటు ఆ రాష్ట్ర భక్తులు కూడా సందర్శిస్తారు. ఇక్కడి స్వామివారిని ధన్వంతరి వెంకటేశ్వరస్వామిగా పిలుస్తారు. జనమేజయుడు ఇక్కడి స్వామివారి విగ్రహాలు ప్రతిష్టించినట్లు చారిత్రక తెలియజేస్తాయి. స్వామివారికి ఏటా ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాలలో భాగంగా రాష్ట్రస్థాయి ఒంగోలుజాతి పశుబల ప్రదర్శన పోటీలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత.
విభాగాలు: పాలమూరు జిల్లా దేవాలయాలు, అయిజ మండలము, |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి