13, మే 2013, సోమవారం

బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం (Bellampalli Assembly Constituency)

ఆదిలాబాదు జిల్లాలోని 10 శాసనసభ నియోజకవర్గాలలో బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఇది నూతనంగా ఏర్పడింది. ఆదిలాబాదు తూర్పువైపున ఉన్న ఈ నియోజకవర్గం పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేయబడినది.

నియోజకవర్గం పరిధిలోని మండలాలు

ఎన్నికైన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 జి.మల్లేష్ సి.పి.ఐ. చిలుముల శంకర్ కాంగ్రెస్ పార్టీ
2014 చిన్నయ్య తెరాస గుండా మల్లేష్‌ సి.పి.ఐ
2018 దుర్గం చిన్నయ్య తెరాస గడ్డం వినోద్ బీఎస్పీ

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి మహాకూటమి తరఫున పోటీచేసిన సి.పి.ఐ.కు చెందిన జి.మల్లేష్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన చిలుముల శంకర్‌పై 7886 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినారు. పొత్తులో భాగంగా ఈ స్థానం సి.పి.ఐ.కు కేటాయించడంతో ప్రజారాజ్యం పార్టీలోకి ఫిరాయించిన మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి మూడవస్థానంలో నిలిచారు.

2014 ఎన్నికలు:
2014 శాసనసభ ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస తరఫున పోటీచేసిన చిన్నయ్య తన సమీప ప్రత్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే, సీపిఐకు చెందిన గుండా మల్లేష్‌పై 52528 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున సిటింగ్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, భాజపా తరఫున కొయ్యల ఎమాజీ, జనకూటమి తరఫున సీపీఐకు చెందిన గుండా మల్లేష్ పోటీచేశారు. తెరాసకు చెందిన దుర్గం చిన్నయ్య తన సమీప ప్రత్యర్థి, బీఎస్పీ పార్టీకి చెందిన గడ్డం వినోద్ పై 11276 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.



విభాగాలు: ఆదిలాబాదు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక