కవిగా, సంపాదకుడిగా పేరుపొందిన వల్లపురెడ్డి బుచ్చారెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరుకు చెందిన వారు. 1932లో జన్మించిన బుచ్చారెడ్డి ప్రధానోపాధ్యాయులుగా, లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడరుగా వివిధ హోదాలలో పనిచేశారు. ఉపాధ్యాయులుగా ఉన్నప్పుడే కపిలవాయి లింగమూర్తి సాన్నిహిత్యంతో రచనలు ప్రారంభించారు. 1979లో పీహెచ్‌డి పొందారు. 2 పత్రికలకు (1954లో విద్యుల్లత, 1960లో ఉదయభాను) సంపాదకత్వం వహించారు. వీరు రచించిన అనేక వ్యాసాలు పత్రికలలో ప్రచురితమైనాయి.
విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రచయితలు, పెబ్బేరు మండలము, |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి