13, మే 2013, సోమవారం

నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం (Nirmal Assembly Constituency)

ఆదిలాబాదు జిల్లాలోని 10 శాసనసభ నియోజకవర్గాలలో నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గం అదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2009 నాటి నియోజకవర్గాలపునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గ పరిధిలో 5 మండలాలు ఉన్నాయి. ఈ సెగ్మెంటు ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము.

నియోజకవర్గం పరిధిలోని మండలాలు

ఎన్నికైన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1957 ముత్యంరెడ్డి ఇండిపెండెంట్ పి.రెడ్డి కాంగ్రెస్ పార్టీ
1962 పి.నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ పి.రెడ్డి ఇండిపెండెంట్
1967 పి.నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎల్.ప్రభాకర్ రెడ్డి ఇండిపెండెంట్
1972 పి.నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ ఎన్నిక -
1978 పి.గంగారెడ్డి కాంగ్రెస్-ఐ పి.నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1983 ఏ.భీంరెడ్డి తెలుగుదేశం పార్టీ పి.గంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1985 ఎస్.వేణుగోపాలచారి తెలుగుదేశం పార్టీ జి.వి.నరసారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1989 ఎస్.వేణుగోపాలచారి తెలుగుదేశం పార్టీ ఏ.భీంరెడ్డి కాంగ్రెస్ పార్టీ
1994 ఎస్.వేణుగోపాలచారి తెలుగుదేశం పార్టీ పి.నరసారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1999 ఏ.ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్.ఇంద్రకరణ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
2004 ఏ.ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వి.సత్యనారాయణ గౌడ్ తెలుగుదేశం పార్టీ
2009 ఎ.మహేశ్వర్ రెడ్డి ప్రజారాజ్యం పార్టీ ఏ.ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2014 ఐ.ఇంద్రకరణ్ రెడ్డి బసపా శ్రీహరిరావు తెరాస
2018 ఐ.ఇంద్రకరణ్ రెడ్డి తెరాస ఎ.మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇంద్రకరణ్ రెడ్డిపై 2545 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. పొత్తులో భాగంగా ఈ స్థానం తెరాసకు కేటాయించడంతో తెలుగుదేశం పార్టీకి చెందిన మహేశ్వర్ రెడ్డి ప్రజారాజ్యం తరఫున పోటీచేసి గెలుపొందినారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ఐ.ఇంద్రకరణ్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెరాసకు చెందిన శ్రీహరిరావుపై 8628 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఇంద్రకరణ్ రెడ్డి తర్వాత తెరాసలో చేరి కేసీఆర్ మంత్రివర్గంలో దేవాదాయశాక మంత్రిగా పదవి పొందారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున సిటింగ్ ఎమ్మెల్యే మరియు దేవాదాయశాఖ మంత్రి అయిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, భాజపా తరఫున ప్రముఖ గైనకాలిస్ట్‌గా పేరుపొందిన వైద్యురాలు బండ్ల సువర్ణారెడ్డి, జనకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన (2009లో ప్రజారాజ్యం తరఫున విజయం సాధించిన) ఆలేటి మహేశ్వర్ రెడ్డి చేశారు. తెరాసకు చెందిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆలేటి మహేశ్వర్ రెడ్డి పై 9271 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


విభాగాలు: ఆదిలాబాదు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక