3, ఫిబ్రవరి 2014, సోమవారం

అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Allola Indrakaran Reddy)

అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
జననంఫిబ్రవరి 16, 1949
స్వస్థలంఎల్లపల్లి (నిర్మల్ మండలం)
పదవులుజడ్పీ చైర్మెన్, 2 సార్లు ఎంపి,
నియోజకవర్గం ఆదిలాబాదు లో/ని,
అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదిలాబాదు జిల్లా నిర్మల్ మండలం ఎల్లపల్లిలో 1949 ఫిబ్రవరి 16న జన్మించారు. బీకాం, ఎల్.ఎల్.బి.వరకు అభ్యసించారు. జిల్లా పరిషత్తు చైర్మెన్‌గా, 2 సార్లు ఎంపీగా, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. డిసెంబరు 2014లో తెలంగాణ మంత్రివర్గంలో స్థానం పొందారు.

రాజకీయ ప్రస్థానం:
1983లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఇంద్రకరణ్ రెడ్డి 1985లో తెదేపా జిల్లా కన్వీనర్‌గా పనిచేశారు. 1987లో జడ్పీ చైర్మెన్‌గా ఎన్నికైనారు. 1991లో ఆదిలాబాదు నుంచి లోకసభకు ఎన్నికైనారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1994, 1996లలో ఓడిపోయారు. 1999, 2004లలో నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2008లో ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం ఉప ఎన్నికలలో విజయం సాధించారు. 2009లో నిర్మల్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014లో నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున పోటీచేసి గెలుపొంది తర్వాత తెరాసలో చేరారు. డిసెంబరు 16, 2014న మంత్రివర్గ విస్తరణలో మంత్రిపదవి లభించింది.

విభాగాలు: ఆదిలాబాదు జిల్లా రాజకీయ నాయకులు, నిర్మల్ మండలము, 1949లో జన్మించినవారు, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం, ఆదిలాబాదు జడ్పీ చైర్మెన్లు, తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత మంత్రులు,


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • తెలుగు వికీపీడియా,
  • ఆంగ్ల వికీపీడియా,
  • లోకసభ వెబ్‌సైట్,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక