సర్రాఫ్ వెంకటేశ్వరరావు 1927 జూన్ 4న బాలానగర్ మండలం కుచ్చర్ కల్ గ్రామంలో జన్మించారు. ఇతను స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘసేవకుడు. 1940 నుంచి గాంధీ కార్యక్రమాలకు ఆకర్షితులై పనిచేయనారంభించారు. మహబూబ్ నగర్ పట్టణంలో జరిగిన సభలో ఆర్యసమాజ్ నాయకుడు పండిత్ నరేంద్ర ఉత్తేజకర ప్రసంగం విని, ప్రేరణ పొంది నిజాం నిరంకుశ పాలనకు, మతోన్మాదులైన రజాకార్లకు వ్యతిరేకంగా పనిచేశారు. 1947-48లో స్టేట్ కాంగ్రెస్ ప్రతినిధిగా అచ్చంపేట తాలుకా నుంచి ఎన్నుకోబడ్డారు. 1952లో వినోబాభావే ప్రారంభించిన భూదానోద్యమంలో కూడా పాల్గొన్నారు.
విభాగాలు: పాలమురు జిల్లా సమరయోధులు, బాలానగర్ మండలం, |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి