16, జూన్ 2013, ఆదివారం

బాపట్ల లోకసభ నియోజకవర్గం (Bapatla Loksabha Constituency)

బాపట్ల లోకసభ నియోజకవర్గం
జిల్లాగుంటూరు, ప్రకాశం
ప్రస్తుత ఎంపినందిగాం సురేశ్
పార్టీవైకాపా


ఆంధ్రప్రదేశ్ లోని 25 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజక వర్గంలో గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 7 అసెంబ్లీ నియోజక వర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. 2019లో జరిగిన 17వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైకాపా పార్టీకి చెందిన నందిగాం సురేశ్ ఎన్నికయ్యారు.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు 

లోకసభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
6వ 1977-80 పి.అంకినీడు ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీ
7వ 1980-84 పి.అంకినీడు ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీ
8వ 1984-89 చిమటా సాంబు తెలుగుదేశం పార్టీ
9వ 1989-91 సలకల బెంజమిన్ కాంగ్రెస్ పార్టీ
10వ 1991-96 దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ
11వ 1996-98 ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ
12వ 1998-99 నేదురుమల్లి జనార్ధనరెడ్డి కాంగ్రెస్ పార్టీ
13వ 1999-04 దగ్గుబాటి రామానాయుడు తెలుగుదేశం పార్టీ
14వ 2004-09 దగ్గుబాటి పురంధరేశ్వరి కాంగ్రెస్ పార్టీ
15వ 2009-14 పనబాక లక్ష్మి కాంగ్రెస్ పార్టీ
16వ 2014-19 శ్రీరాం మల్యాద్రి తెలుగుదేశం పార్టీ
17వ 2019- నందిగాం సురేశ్ వైకాపా

2009 ఎన్నికలు:
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన నెల్లూరు సిటింగ్ ఎంపీ పనబాక లక్ష్మి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన మర్యాద్రి శ్రీరాంపై 69,338 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పనబాక లక్ష్మి 460757 ఓట్లు పొందగా, శ్రీరాంకు 391419 ఓట్లు లభించాయి. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి ఎన్.రామారావు 3వ స్థానంలో, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బి.రోశయ్య 4వ స్థానంలో నిలిచారు.

2019 ఎన్నికలు:
2019 ఎన్నికలలో ఇక్కడి నుంచి వైకాపాకు చెందిన నందిగాం సురేష్ తన సమీప ప్రత్యర్థి, సిటింగ్ ఎంపీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన మల్యాద్రి శ్రీరాంపై 14,847 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైకాపా అభ్యర్థికి 5,98,257 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 5,82,192 ఓట్లు లభించాయి. బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన దేవానంద్ 42,580 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు.

హోం,
విభాగాలు: గుంటూరుజిల్లా నియోజకవర్గాలు, ప్రకాశం జిల్లా నియోజకవర్గాలు, బాపట్ల లోకసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజకవర్గాలు


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక