జె.వి.రాఘవులు
(1931-2013)
| |
జననం | 1931 (రామచంద్రాపురం) |
జిల్లా | తూర్పు గోదావరి |
రంగం | సంగీత దర్శకుడు |
మరణం | జూన్ 7, 2013 |
సంగీత స్వరకర్తగా, సంగీత దర్శకుడిగా ప్రసిద్ధి చెందిన జెట్టి వీర రాఘవులు 1931లో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో రైతు కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే రాజమండ్రికి వచ్చి స్థిరపడ్డారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల పి.యు.సి.ని మధ్యలోనే ఆపివేయవలసి వచ్చింది.
రాఘవులు చిన్నవయస్సు నుంచే పద్యాలు చదవడంలో ఆసక్తి కనబర్చినారు. ఘంటశాల పాల్గొన్న ఒక సంగీత కార్యక్రమంలో పద్యాలు చదివి ఘంటశాల దృష్టిని ఆకర్షించడం, ఘంటశాల ఆహ్వానంపై 1958లో మద్రాసు (చెన్నై) నగరానికి వెళ్ళడం జరిగింది. ఘంటశాల జీవించి ఉన్నంత కాలం ఆయన వెన్నంటియున్నారు. మొదట్లో ఘంటశాల వద్ద సహాయ సంగీత దర్శకుడిగా పనిచేసిన రాఘవులు, లవకుశ సినిమా ఘనవిజయం అనంతరం సంగీత దర్శకుడిగా మారిన పిదప ఈయన సంగీత దర్శకత్వంలో ఘంటశాల పాడిన పాటలు ఆల్‌టైం హిట్స్‌గా పేరుపొందాయి. రాఘవులు అక్క కూతురు రమణమ్మను వివాహం చేసుకున్నారు.
1970లో డి.రామానాయుడు తీసిన "ద్రోహి" చిత్రానికి రాఘవులు తొలిసారిగా సంగీత దర్శకత్వం వహించారు. 1972లో "జీవన తరంగాలు" చిత్రం ఈయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 1974లో ఘంటశాల మరణించాక మద్రాసు ఉండలేక 1995లో రాజమండ్రి తిరిగివచ్చారు. రాఘవులు గాయకుడిగా 100 సినిమాలకు, సంగీత దర్శకుడిగా 172 సినిమాలకు పనిచేశారు. చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. నటులు, నిర్మాతాల నుంచి ఆర్థిక సహాయంకై అర్థించారు. గోదావరి ముద్దుబిడ్డగా పేరుపొందిన రాఘవులు జూన్ 7, 2013న మరణించారు.

విభాగాలు: సంగీత దర్శకులు, తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు, రామచంద్రాపురం మండలం, 1931లో జన్మించినవారు, 2013లో మరణించినవారు, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి