12, జూన్ 2013, బుధవారం

పొన్నాల లక్ష్మయ్య (Ponnala Laxmaiah)

పొన్నాల లక్ష్మయ్య
జననంఫిబ్రవరి 15, 1944
స్వస్థలంఖిల్లాషాపురం (వరంగల్ జిల్లా)
పదవులురాష్ట్ర మంత్రి, 5 సార్లు ఎమ్మెల్యే,
నియోజకవర్గం జనగామ అ/ని,
పొన్నాల లక్ష్మయ్య తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. ఇతను ఫిబ్రవరి 15, 1944న జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిల్లాషాపురంలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, అమెరికాలలో ఉన్నత విద్య అభ్యసించి 1978 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. జనగామ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 4 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. నేదురుమల్లి, వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ మంత్రివర్గాలలో పనిచేశారు. 2014మార్చి 11న తెలంగాణ పిసిసి తొలిఅధ్యక్షుడిగా నియమితులైనారు.

బాల్యం, విద్యాభ్యాసం:
జనగామ జిల్లా రఘునాథపాలెం మండలం ఖిలాషాపురంలో మాతామహుల ఇంట్లో జన్మించిన పొన్నాల లక్ష్మయ్య ప్రాథమిక విద్యాభ్యాసం స్థానికంగానే చేశారు. తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో ఖిలాషాపురంలోనే బాల్యం గడిచింది. పియుసి హన్మకొండలోనూ, మెకానికల్ ఇంజనీరింగ్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తిచేశారు. అమెరికాలోని ఓక్లహామా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎస్. పట్టాపొందారు.

రాజకీయ ప్రస్థానం:
1978 నుంచి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. 1985-89 కాలంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటి కోశాధికారిగా వ్యవహరించారు. 1989లో తొలిసారిగా జనగామ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 1990లో పిసిసి సభ్యులైనారు. 1991లో తొలిసారిగా నేదురుమల్లి జనార్థన్ రెడ్డి మంత్రివర్గంలో మత్స్యశాఖ మంత్రిగా పనిచేశారు. 1999, 2004లలో కూడా ఇదే నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2004లో వైఎస్సార్ మంత్రివర్గంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా, ఐటి శాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో జనగామ నుంచే 4వ సారి ఎన్నికై వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ మంత్రివర్గాలలో స్థానం పొందినారు. 2014, మార్చి 10న తెలంగాణ పిసిసి తొలి అధ్యక్షునిగా నియమితులైనారు.

ఇవి కూడా చూడండి:


విభాగాలు: జనగామ జిల్లా ప్రముఖులు,  జనగామ అసెంబ్లీ నియోజకవర్గం, 13వ శాసనసభ సభ్యులు, 13వ శాసనసభ మంత్రులు,


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక