తెలంగాణలోని 17 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజకవర్గంలో మెదక్ జిల్లాకు చెందిన 7 అసెంబ్లీ నియోజకవర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. 1980లో ఇందిరాగాంధీ ఇక్కడి నుంచే విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన బాగారెడ్డి వరసగా 4 సార్లు గెలుపొందినారు. 2019లో జరిగిన 17వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు.
దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి మహాకూటమి తరఫున పోటీచేసిన తెరాస అభ్యర్థి విజయశాంతి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చాగళ్ళ నరేంద్రనాథ్ పై 6,077 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. విజయశాంతికి 388839 ఓట్లు రాగా, నరేంద్రనాథ్‌కు 382762 ఓట్లు లభించాయి. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి ఖాజాఖయ్యూం 3వ స్థానంలో, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పి.నిరూప్ రెడ్డి 4వస్థానంలో నిలిచారు.
2014 ఎన్నికలు: 2014 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి 15 అభ్యర్థులు నామినేషన్ వేయగా 2 నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. తుదిబరిలో 13 అభ్యర్థులు మిగిలారు. తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రవణ్ కుమార్ రెడ్డీపై 3,97,029 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. కెసిఆర్ శాసనసభ ఎన్నికలలో కూడా విజయం సాధించడం, తెరాసకు తెలంగాణలో మెజారిటి స్థానాలు లభించడంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ స్థానానికి రాజీనామా చేశారు. సెప్టెంబరు 13న ఉప ఎన్నిక జరిగింది. 2014 ఉప ఎన్నిక: కె.చంద్రశేఖర్ రావు రాజీనామా చేయడంతో సెప్టెంబరు 13న ఉప ఎన్నిక జరిగింది. తెరాస తరఫున ప్రభాకర్ రెడ్డి, భాజపా-తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరఫున సునీతారెడ్డి పోటీచేశారు. తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతారెడ్డిపై 3,61,286 ఓట్ల భారీ ఆధిక్యతతో విజయం సాధించారు. భాజపా అభ్యర్థి జగ్గారెడ్డికి మూడవ స్థానం లభించింది. మొత్తం 15,43,073 ఓట్లకు గాను 10,46,114 ఓట్లు పోలయ్యాయి. తెరాసకు 5,71,810 ఓట్లు, కాంగ్రెస్ పార్టికి 2,10,524 ఓట్లు, భాజపాకు 1,86,343 ఓట్లు లభించాయి. నోటాకు 10,964 ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికలు: 2019లో జరిగిన ఎన్నికలో తెరాసకు చెందిన సిటింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన గాలి అనిల్ కుమార్‌పై 3,16,427 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. తెరాస అభ్యర్థికి 5,960,48 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 2,79,621 ఓటు వచ్చాయి. భారతీయ జనతాపార్టీకి చెందిన రఘునందన్ రాజ్ 2,01,567 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు.
= = = = =
|
16, జూన్ 2013, ఆదివారం
మెదక్ లోకసభ నియోజకవర్గం (Medak Loksabha Constituency)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి