3, జులై 2013, బుధవారం

అల్లూరి సీతారామరాజు (Alluri Seeta Ramaraju)

అల్లూరి సీతారామరాజు
(1897-1923)
జననంజూలై 4, 1897 (పాండ్రంగి)
స్వస్థలంమోగల్లు
రంగంబ్రిటీష్ వారిపై సమరం
మరణంమే 7, 1923
ఆంగ్లేయుల పాలన అంతమొందించడానికి కంకణం కట్టుకొని యుక్త వయస్సులోనే అమరుడైన అల్లూరి సీతారామరాజు జూలై 4, 1897న పాండ్రంగిలో జన్మించారు. చిన్నవయస్సులోనే తండ్రిని కోల్పోయాడు. దైవభక్తి, జాతీయభావాలు యుక్తవయసులోనే అలవర్చుకున్నాయి. 18 సంవత్సరాల వయస్సులో ఉత్తరభారతంలోని ప్రముఖ క్షేత్రాలైన బదిరీనాథ్, కేదరానాథ్, రుషికేష్, గంగోత్రి తదితరాలను కాలినడకన సందర్శించి స్వగ్రామం చేరారు. 21 ఏళ్ళ వయస్సులో ఉన్నప్పుడు కృష్ణదేవిపేట ప్రాంతంలో తపస్సులో నిమగ్నమైనాడు. ఆ అటవీప్రాంతం వారికి సన్నిహితుడై వారి మనస్సులు గెలుచుకున్నాడు. వారు కూడా అల్లూరిని ఆరాధించడం ప్రారంభించారు. గిరిజనులను ఉద్ధరించడానికి అల్లూరి ప్రయత్నింస్తుంటే ఆప్ర్రాంత ఆంగ్లేయ అధికారికి కనువిప్పు కలిగి ఇతన్ని ఎలాగైన ఈ ప్రాంతం నుంచి గెంటివేయాలని కుయుత్నాలు ప్రారంభించాడు.

1922లో అల్లూరి తెల్లదొరల అక్రమాలు, అన్యాయాలు, అధర్మాలు ఎదిరించడానికి పూనుకున్నాడు. అనుచరులను తయారుచేసుకొని ముందుగా ఆయుధాలు సంపాదించడానికి ముందస్తు హెచ్చరికతో చింతపల్లి పోలీస్ స్టేషన్ పై దాడికి నిర్ణయించారు. ఆ పిదప కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లపై కూడా దాడిచేశారు. అల్లూరి అనుచరులు బ్రిటీష్ అధికారులను ముప్పుతిప్పలు పెట్టి, మూడుచెరువుల నీళ్ళు త్రాగించారు. ముందస్తు హెచ్చరికతో దాడులు చేస్తున్ననూ పారిపోవడం మినహా పట్టుకోవడం సాధ్యం కావడం లేదు.

అప్పటి ఏజెన్సీ కమీషనర్ అల్లూరిని పట్టుకుంటే 10,000 రూపాయలు, మల్లుదొర, గంటందొరలకు 1000 రూపాయల బహుమతి ప్రకటించాడు. అప్పటికిది అధిక మొత్తమే అయిననూ అల్లూరిని పట్టుకోవడానికి స్థానికులెవరూ సాహసం చేయలేరు, పైగా అండదండలందించారు. దీంతో బ్రిటీష్ వారు గిరిజనులను మరింత హింసించడంతో అల్లూరి కలత చెంది, తనవల్ల అమాయక గిరిజనులను బాధపెట్టడం ఇష్టంలేక మే 7, 1923న తనంతట తానే లొంగిపోయారు. పోలీస్ అధికారి మేజర్ గుడాల్ చెట్టుకు కట్టివేసి రివాల్వర్ పేల్చి నిర్దాక్షిణ్యంగా కాల్చివేశాడు. 27 ఏళ్ళ చిన్న వయస్సులోనే బ్రిటీష్ వారిని ఎదిరించి అమరుడైన అల్లూరి గిరిజనుల పాలిట విప్లవజ్యోతి, ఆరాధ్యదైవం.

ఇవి కూడా చూడండి:

విభాగాలు: ఆంధ్రప్రదేశ్ ప్రముఖులు, తూర్పు గోదావరి జిల్లా సమరయోధులు, 1897, 1923,


 = = = = =


tags:about Alluri Seeta ramaraju in Telugu, Alluri Jeevitha Chatitra, Andhra Pradesh Famous Persons in telugu

2 కామెంట్‌లు:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక