16, జులై 2013, మంగళవారం

సముద్రాల వేణుగోపాలచారి (Samudrala Venugopalachari)

 సముద్రాల వేణుగోపాలచారి
జననం1960, మే 10
స్వస్థలంనిర్మల్
పదవులుకేంద్రమంత్రి, 3 సార్లు ఎంపీ, 4 సార్లు ఎమ్మెల్యే,
నియోజకవర్గంనిర్మల్ అ/ని, ముధోల్ అ/ని, ఆదిలాబాదు లో/ని,
ఆదిలాబాదు జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు సముద్రాల వేణుగోపాలచారి 1960 మే 10న నిర్మల్‌లో జన్మించారు. 1982లో రాజకీయాలలో ప్రవేశించి, 1982లో నిర్మల్ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా, 1984లో ఆదిలాబాదు జిల్లా గ్రంథాలయ చైర్మెన్‌గా పనిచేశారు. 1985, 1989, 1994లలో వరుసగా 3 సార్లు నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1995లో రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రిగా పనిచేశారు. 1996లో ఆదిలాబాదు నియోజకవర్గం నుంచి లోకసభకు ఎన్నికై, కేంద్రంలో విద్యుత్, వ్యవసాయ శాఖ మంత్రిగా నియమితులైనారు. కేంద్రమంత్రిగా పనిచేసిన తొలి జిల్లావాసిగా రికార్డు సృష్టించారు. 1998, 1999లలో కూడా లోకసభకు ఎన్నికయ్యారు. 2009లో ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2011లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. జూలై 14, 2013న తెరాసలో చేరారు.


విభాగాలు: ఆదిలాబాదు జిల్లా రాజకీయ నాయకులు, నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం, ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గం, నిర్మల్ మండలము, కేంద్రమంత్రులు, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం , 1960, 


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక