26, జులై 2013, శుక్రవారం

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (Sriramsagar Project)

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
ప్రారంభం1963
నదిగోదావరి నది
స్థలంపోచంపాడు (నిజామాబాదు జిల్లా)
సామర్థ్యం90 TMC
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిజామాబాదు జిల్లా మెండోరా మండలములో పోచంపాడు గ్రామవద్ద గోదావరి నదిపై నిర్మించబడింది. దీని పూర్వపు పేరు పోచంపాడు ప్రాజెక్టు. గోదావరినదిపై తెలంగాణలో ఇది మొట్టమొదటి ప్రాజెక్టు. మహారాష్ట్రలోని జైక్వాడి ప్రాజెక్టు తరువాత గోదావరి నదిపై దీనిని నిర్మించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పరిధిలో బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీరు ఈ ప్రాజెక్టు నుంచే సరఫరా అవుతుంది. ఈ ప్రాజెక్టుకు కాకతీయ కాల్వ, సరస్వతి కాల్వ, లక్ష్మీ కాల్వ అనే మూడు కాల్వలు కలవు. 1963లో నిర్మించిన ఈ ప్రాజెక్టు ప్రారంభంలో కేవలం నీటిని నిల్వచేసి నీటిపారుదలకు ఉపయోగపడే జలాశయంగానే ఉండేది. 1983 తర్వాత నందమూరి తారక రామారావు ప్రభుత్వ హయంలో ఈ ప్రాజెక్టును విస్తరించి జల విద్యుత్ ఉత్పాదన సంస్థగా అభివృద్ధి చేశారు.

జూలై 26, 1963న అప్పటి ప్రధానమంత్రి నెహ్రూచే శంకుస్థాపన జరుపుకున్న ఈ ప్రాజెక్టు నేడు తెలంగాణలోని 6 జిల్లాల పరిధిలోని 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నది. వేలాది గ్రామాలకు తాగునీటికి కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతోంది.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జిల్లా కేంద్రమైన నిజామాబాదు నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది 44వ నెంబరు జాతీయ రహదారి నుండి 5 కిలోమీటర్లు లోనికి ఉంది. ఆదిలాబాదు జిల్లా నిర్మల్ పట్టణం నుండి దీని దూరం 20 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టు 18°58' ఉత్తర అక్షాంశం, 78°19' తూర్పు రేఖాంశం పై ఉంది.

జలాశయ సామర్థ్యం
  • శ్రీరాంసాగర్ జలాశయపు నీటిమట్టం గరిష్ట ఎత్తు 1091 అడుగులు,
  • జలాశయ నీటి నిల్వ సామర్థ్యం 90 శత కోటి ఘనపుటడుగులు
  • ఈ ప్రాజెక్టునకు మొత్తం 42 వరద గేట్లు కలవు.
  • ఈ ప్రాజెక్టు నుంచి నీటి సరఫరాఆయె కాలువలు: కాకతీయ కాల్వ, సరస్వతి కాల్వ, లక్ష్మి కాల్వ, వరద కాల్వ.

విభాగాలు: నిజామాబాదు జిల్లా ప్రాజెక్టులు, గోదావరి నది, నిజామాబాదు జిల్లా, మెండోరా మండలము, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, 1963, 


 = = = = =

Tags: Sriram Sagar Projects, Sri ramsagar project, telangana projects in telugu Mendora mandal

3 కామెంట్‌లు:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక