మెండోరా నిజామాబాదు జిల్లాకు చెందిన మండలము. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అదివరకు బాల్కొండ మండలంలో ఉన్న 8 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. 44వ నెంబరు జాతీయ రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నది. తెలంగాణలోని ప్రముఖ ప్రాజెక్టులలో ఒకటైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఈ మండలంలోనే ఉంది. మండలం ఉత్తర సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తోంది. మండలంలో 8 ఎంపీటీసి స్థానాలు, 11 గ్రామపంచాయతీలు, 8 రెవెన్యూ గ్రామాలు కలవు.
భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా మెండోరా మండలం నిజామాబాదు జిల్లాలో ఉత్తరం వైపున నిర్మల్ జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి తూర్పున ఎర్గట్ల మండలం, దక్షిణాన ముప్కాల్ మండలం, పశ్చిమాన నందిపేట మండలం, ఉత్తరాన నిర్మల్ జిల్లా సరిహద్దులుగా ఉంది. ఉత్తర సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తోంది. రాజకీయాలు: ఈ మండలం బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం, నిజామాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 ప్రకారం మండలంలో 8 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Bussapur, Chakiryal, Doodgaon, Kodicherla, Mendora, Savel, Sonpet & Pochampad, Velgatoor మండలంలోని గ్రామపంచాయతీలు: బుస్సాపూర్, చాకిర్యాల్, దూద్‌గాన్, కొడిచెర్ల, మెండోరా, నడిమి తండా, నెహ్రూనగర్ కాలని, పోచంపాడు, సావెల్, సోన్‌పేట్, వెల్గటూర్
ప్రముఖ గ్రామాలు
మెండోరా (Mendora): మెండోరా నిజామాబాదు జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. అక్టోబరు 11, 2016న ఈ గ్రామం మండల కేంద్రంగా మారింది. అంతకుక్రితం బాల్కొండ మండలంలో భాగంగా ఉండేది. శ్రీరాంసాగర్ యొక్క కాలువ గ్రామసమీపం నుంచి వెళ్తుంది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Mendora Mandal, Nizamabad Dist (district) Mandal in telugu, Nizamabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి