కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన చక్రవర్తులలో రుద్రమదేవి ప్రముఖస్థానం ఆక్రమించింది. తండ్రి గణపతిదేవుని అనంతరం రాజ్యానికి వచ్చిన రుద్రమదేవి దక్షిణభారతదేశంలోనే తొలి మహిళా పాలకురాలిగా గుర్తింపు పొందింది. ఈమె అసలు పేరు రుద్రాంబ. ఈమె తండ్రి గణపతిదేవునికి పుత్ర సంతానం లేనందువల్ల రుద్రాంబను తన కుమారుడిలా పెంచుకొని రుద్రదేవుడని నామకరణం చేసాడు. గణపతిదేవుడు తన కుమర్తె రుద్రమదేవిని నిడదవోలు ప్రాంతాన్ని పాలిస్తున్న తూర్పు చాళుక్యుడైన వీరభద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. రుద్రమదేవికి ఇద్దరు కుమార్తెలు. రుద్రమదేవికి రాయగజకేసరి, ఘటోదృతి బిరుదులున్నాయి. వెనిస్ యాత్రికుడు మార్కోపోలో ఈమె కాలంలోనే కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించాడు.
జీవిత విశేషాలు: కాకతీయ చక్రవర్తులలో అగ్రగణ్యుడైన గణపతిదేవుని తరువాత 1262 లో రుద్రమదేవి 'రుద్రమహారాజు ' బిరుదంతో కాకతీయ మహాసామ్రాజ్య సింహాసనాన్ని అధిష్టించింది. అయితే ఒక మహిళ పాలకురాలు కావటం ఓర్వలేని అనేకమంది సామంతులు తిరుగుబాటు చేసారు. పాకనాటి కాయస్థ అంబదేవుడు, కళింగ నరసింహుని కుమారుడు వీరభానుడు తిరుగుబాట్లు చేసారు. రుద్రమ తన సేనానులతో కలిసి ఈ తిరుగుబాట్లనన్నిటినీ విజయవంతంగా అణచివేసింది. రుద్రమాంబ ఎదుర్కొన్న దండయాత్రలన్నిటిలోకీ దేవగిరి యాదవరాజుల దండయాత్ర అతి కీలకమైనది. యాదవరాజు మహాదేవుడు ఓరుగల్లును ముట్టడించాడు, అయితే రుద్రమ యాదవలను ఓడించి, దేవగిరి దుర్గం వరకూ తరిమి కొట్టింది. మహదేవుడు సంధికి దిగివచ్చి నష్టపరిహారం చెల్లించాడు.రుద్రమ తానే స్వయంగా కాయస్త రాజ్యంపై దాడి చేసినట్లు తెలుస్తోంది. చందుపట్ల (నల్గొండ) శాసనం ఆధారంగా కాయస్త అంబదేవునితో జరిగిన యుద్ధాలలోనే మరణిచినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
10, సెప్టెంబర్ 2013, మంగళవారం
రుద్రమ దేవి (Rudrama Devi)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి