ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరుగా పనిచేసిన కోన ప్రభాకరరావు జూలై 10, 1916న గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు. ప్రాధమికవిద్య బాపట్లలో పూర్తి చేసుకొని మద్రాసులోని లయోలా కళాశాలనుండి పట్టభద్రుడయ్యారు. ఆ తరువాత పూణేలోని ఐ.ఎల్.ఎస్ న్యాయ కళాశాలనుండి న్యాయ శాస్త్రములో డిగ్రీ పూర్తిచేశారు. పాఠశాల అభ్యసనలో ఉన్నప్పుడే ఉప్పు సత్యాగ్రహములో పాల్గొన్నారు. స్వాతంత్ర్యోద్యమ కాలములో ఒక యువబృందాన్ని నిర్వహించి ఖాదీ వాడకాన్ని వ్యాప్తి చేయటానికి కృషి చేశారు. అక్టోబరు 20, 1990న మరణించారు.
రాజకీయ ప్రస్థానం: ప్రభాకరరావు 1940 అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రములోని బాపట్లలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. రాజకీయాలలో ప్రవేశించి 1967లో ఆంధ్రప్రదేశ్ శాసన సభకు బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నికైనారు. తర్వాత బాపట్ల నుంచే 1972, 1978లలో కూడా ఎన్నికై హాట్రిక్ సాధించారు. 1980-81లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరుగా నియమితుడైనారు. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా కూడా పనిచేశారు. భవనం వెంకట్రామ్ మరియు కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాలలో ఆర్థిక మరియు ప్రణాళికాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ప్రభాకరరావు 1983 సెప్టెంబరు 2న పాండిచ్చేరి గవర్నరుగా, 1984 జూన్ 17న సిక్కిం గవర్నరుగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత 1985, మే 30 న మహారాష్ట్ర గవర్నరుగా నియమితులైనారు. 1986 ఏప్రిల్లో బొంబాయి విశ్వవిద్యాలయం మార్కుల విషయంలో చేలరేగిన దుమారంలో ఈయన పాత్రపై సంశయం ఏర్పడ్డంతో మహారాష్ట్ర గవర్నరు పదవికి రాజీనామా చేశారు. క్రీడలు, సినిమాలు: క్రీడలలో ఆసక్తి కలిగిన ప్రభాకర్ 1938లో బొంబాయి విశ్వవిద్యాలయంలో టెన్నిస్ ఛాంపియన్ అయ్యారు. బాపట్ల మరియు ఇతర ప్రదేశాలలో శివాజీ వ్యాయామ మండలి స్థాపనకు తోడ్పడ్డారు. పూణేలో కళాశాల రోజుల్లో ప్రభాకర్ కుస్తీలు పట్టేవారు. బాడ్మింటన్ ఛాంపియన్ గా కూడా పేరు తెచ్చుకున్నారు. ప్రారంభంలో అనేక తెలుగు సినిమాలను నిర్మించి, దర్శకత్వం వహించారు. కొన్నింటిలో స్వయంగా నటించాడు కూడా. ఈయన సినిమాలలో మంగళసూత్రం, నిర్దోషి, ద్రోహి మరియు సౌదామిని.
= = = = =
|
7, నవంబర్ 2013, గురువారం
కోన ప్రభాకరరావు (Kona Prabhakar Rao)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి