మిద్దె రాములు 1941లో రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజీపేటలో జన్మించారు. విద్యాభ్యాసం లేకున్నా కళలవైపు ఆకర్షితుడై ఒగ్గుకథలో రాణించి, వందలాది ప్రదర్శనలు ఇచ్చి, ఒగ్గుకథ పితామహుడిగా పేరుపొందారు. తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా దేశ, విదేశాలలో సైతం ఒగ్గుకథకు పేరుతెచ్చారు.
గొర్రెల పెంపకం వృత్తిగా ఉన్న గొల్ల కురములుకుల పురుషుడు బీరప్ప కథను ప్రచారం చేసేందుకు ఒగ్గుకథను రూపొందించుకున్నారు. ప్రారంభంలో ఒగ్గుకథను నేర్చుకోవాలనే తపనతో ఒంటరిగా గదిలో తలుపు మూసుకొని, ఆముదపు దీపం నీడలో తన కదలికల్ని గమనిస్తూ అంచెలంచెలుగా పట్టుసాధించి, తన జీవిత కాలంలో సుమారు 50వేల ప్రదర్శనలు ఇచ్చారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాలలో మిద్దె రాములు శిష్యులు వందలాది మంది కళాకారులుగా రాణిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా జనాభా నియంత్రణ, వయోజన విద్య, అక్షరాస్యత కార్యక్రమాల గురించి ప్రచారం చేయడానికి మిద్దె రాములు కథల్ని విరివిగా ఉపయోగించుకుంది. ఆయన కథలో ప్రత్యేకత బోనాల నృత్యం. నెత్తిన బోనం ఉంచుకుని కథ చెబుతూనే నేలను తలతో ముద్దాడేవారు. మిద్దె రాములు ఆకాశవాణి, దూరదర్శన్‌లలో దాదాపు రెండు వందల ప్రదర్శినలిచ్చారు. 1990లో మారిషన్‌లో జరిగిన మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రదర్శన ఇచ్చి అప్పటి మారిషస్ ప్రధాని అనురుధ్ జగన్నాథ్ ప్రశంసలు అందుకున్నారు. తన స్వస్థలానికే చెందిన ప్రముఖ కవి సి.నారాయణరెడ్డి ప్రోత్సాహం కూడా మిద్దె రాములుకు అందింది. తన కళా ప్రతీభతో జానపద కళా బ్రహ్మ' ఒగ్గు కథా చక్రవర్తి, కళాపురస్కార్ బిరుదులు పొందారు. మిద్దె రాములు నవంబరు 25, 2010న మరణించారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
|
26, నవంబర్ 2013, మంగళవారం
మిద్దె రాములు (Midde Ramulu)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
kalakarulanu vluguloniki thechhe meeprayatnam ABINANDANEEYAMINADI
రిప్లయితొలగించండిmee prayatnam maaku panchutundi vignanam
రిప్లయితొలగించండిMidha ramudu
రిప్లయితొలగించండి