వేములవాడ గ్రామీణరాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మండలము. ప్రముఖ రచయిత, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి, జానపద కళాకారుడు మిద్దెరాములు ఈ మండలానికి చెందినవారు. మండలంలో 7 ఎంపీటీసి స్థానాలు, 17 గ్రామపంచాయతీలు, 15 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలం గుండా మానేరు ఉపనది అయిన మూలవాగు ప్రవహిస్తోంది.
అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అంతకుక్రితం వేములవాడ మండలంలో ఉన్న 15 రెవెన్యూ గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. అదేసమయంలో ఈ మండలం కరీంనగర్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున బోయిన్‌పల్లి మండలం, దక్షిణాన వేములవాడ పట్టణ మండలం, నైరుతిన కోనారావుపేట మండలం, పశ్చిమాన చందుర్తి మండలం, ఉత్తరాన జగిత్యాల జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలము వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగము. 2019లో మండల అధ్యక్షులుగా భాజపాకు చెందిన బండ మల్లేశం, జడ్పీటీసిగా తెరాసకు చెందిన ఆశావాణి ఎన్నికైనారు.
వేములవాడ గ్రామీణ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Hanmajipet, Bollaram, Mallaram, Marripalli, Venkatapuram, Nookalamarri, Vattemla, Fazilnagar, Chekkapalli, Edurugatla, Lingampalli, Jayavaram, Kodumunja, Anupuram, Rudraram
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
హనుమాజీపేట (Hanumajipet): హనుమాజీపేట రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలమునకు చెందిన గ్రామము. ప్రముఖ కవి సి.నారాయణరెడ్డి మరియు ఒగ్గుకథకు అంతర్జాతీయ ఖ్యాతిపెట్టిన మిద్దెరాములు ఈ గ్రామానికి చెందినవారు. ఈ గ్రామానికి చెందిన సంకసాల మల్లేశం 2012 ఏప్రిల్ 1న ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమితులయ్యారు.
.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Vemulawada or Vemulavada Rural Mandal in Telugu, Rajanna Sirisilla Dist (district) Mandals in telugu, Rajanna Sirisilla Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి