6, డిసెంబర్ 2013, శుక్రవారం

సామల సదాశివ (Samala Sadashiva)

 సామల సదాశివ
జననంమే 11, 1928
(తెలుగుపల్లె)
జిల్లాకొమరంభీం జిల్లా
రంగంసాహితీవేత్త, సంగీతకారుడు,
మరణంఆగస్టు 7, 2012
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అయిన సామల సదాశివ 1928, మే 11కొమరంభీం జిల్లా, దహేగావ్ మండలం తెలుగు పల్లెలో జన్మించారు. ఇతను బహుభాషావేత్త, తెలుగు మరియు ఉర్దూ రచయితనే కాకుండా సంగీత పండితుడు కూడా.

సంగీత శిఖరాలు, యాది వంటి వ్యాస సంకలనాలు సదాశివ రచించారు. ఇంకనూ అంజద్ రుబాయీలు, ఉర్దూ సాహిత్య చరిత్ర, మౌలానా రూమీ మస్నవీ, ఉర్దూ కవుల కవితా సామగ్రి, మిర్జా గాలిబ్ పుస్తకాలు కూడ ఇతని కలం నుంచి వెలువడ్డాయి. ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకు పోయేట్టు చెప్పెడం అతనికున్న ప్రత్యేకత.

అతని భాషా, శైలీ చాలా సహజ సుందరంగా ఉంటాయి. ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్, హీరాబాయి బరోడేకర్, బడే గులాం అలీఖాన్, అల్లాదియా ఖాన్, బేగం అఖ్తర్, గంగూబాయి హంగల్, కేసర్ బాయి కేర్కర్, ఉస్తాద్ అంజద్ అలీ ఖాన్, ఇలా ఎందరో సంగీత విద్వాంసులను, వారు ఆలపించే విధానాలను సదాశివ  వివరిస్తాడు.

ఆయన సేవలకు గుర్తింపుగా 2011లో సంగీత నాటక అకాడమి అవార్డు, 1998లో శ్రీపొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి, 2002లో కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. ఆగస్టు 7, 2012న మరణించారు.

ఇవి కూడా చూడండి:
విభాగాలు: ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా రచయితలు, తెలుగు సాహితీవేత్తలు, ఉర్దూ సాహితీవేత్తలు, 1928లో జన్మించినవారు, 2012లో మరణించినవారు, 


 = = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక