దహెగాం కొమురంభీం జిల్లాకు
చెందిన మండలము. ఈ మండలము 19° 15' 00'' ఉత్తర అక్షాంశం మరియు 79° 46' 00'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. మండల పరిధిలో పెద్దవాగుపై జగన్నాథపూర్ ప్రాజెక్టు (పాల్వాయి ప్రాజెక్టు) నిర్మిస్తున్నారు. ఈ మండలము ఆసిఫాబాదు రెవెన్యూ డివిజన్, సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. ప్రముఖ సాహితీవేత్త సామల సదాశివ, రాజకీయనేత పాల్వాయి పురుషోత్తం రావు ఈ మండలమునకు చెందినవారు. మండలంలో 8 ఎంపీటీసి స్థానాలు, 24 గ్రామపంచాయతీలు, 31 రెవెన్యూ గ్రామాలు కలవు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి పెంచికలపేట మండలం, వాయువ్యాన కాగజ్‌నగర్ మండలం, పశ్చిమాన మరియు దక్షిణాన మంచిర్యాల జిల్లా, తూర్పున మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్నాయి. చరిత్ర: 1948 జూలై, ఆగస్టులో భారత సైన్యానికి, రజాకార్లకు మధ్యన పెసరికుంట వద్ద కాల్పులు జరిగాయి. ఈ కాల్పులలో 25 మంది మరణించారు. బిట్రా పోలీస్ స్టేషన్‌లో పోరాట యోధులను నిర్భంధించేవారు. భారత సైన్యం, పోరాటయోధులు 1948 ఆగస్టులో దాడిచేసి ఆయుధాగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 1948 సెప్టెంబరులో హైదరాబాదు విమోచన అనంతరం భారత యూనియన్‌లో భాగమైంది. 1948-56 కాలంలో హైదరాబాదు రాష్ట్రంలోనూ, 1956-2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఆదిలాబాదు జిల్లాలో కొనసాగింది. 2016 అక్టోబరు 11న కొత్తగా ఏర్పాటుచేసిన కొమరంభీం జిల్లాలో చేరింది. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 30596. అందులో పురుషులు 15171, మహిళలు 15424. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 34750. ఇందులో పురుషులు 17168, మహిళలు 17582. అక్షరాస్యత శాతం 47.42%. రవాణా సౌకర్యాలు: దహెగాం మండలానికి రైల్వే మరియు జాతీయ రహదారి సౌకర్యం లేదు. కాగజ్‌నగర్ సమీప రైల్వేస్టేషన్. రాజకీయాలు: ఈ మండలము సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము. ఈ మండలమునకు చెందిన పాల్వాయి పురుషోత్తమరావు, పాల్వాయి రాజ్యలక్ష్మి సిర్పూరు నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.
దహెగాం మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Ainam, Amargonda, Beebra, Bhamanagar, Bhogaram, Borlakunta, Brahmanchichal, Chandrapalle, Chinnaraspalle, Dahegaon, Digida, Dubbaguda, Etapalle, Girvelli, Gorregutta, Hathni, Itial, Kalwada, Kammarpalle, Kothmir, Kunchavelli, Laggaon, Loha, Motlaguda, Pambapur, Pesarkunta, Polampalle, Rampur, Ravalpalle, Teepergaon, Vodduguda
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
బిబ్రా (Bibra): బిబ్రా కొమురంభీం జిల్లా దహెగాం మండలమునకు చెందిన గ్రామము. బిబ్రా సమీపంలో నిజాం ప్రభుత్వం పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. నిజామ్ వ్యతిరేక ఉద్యమకారులను ఇక్కడ నిర్బంధించేవారు. 1948 ఆగస్టులో పొరాటయోధులు, భారత సైన్యం కలిసి పోలీస్ స్టేషన్, ఆయుధాగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు చెందిన శిథిల భవనం ఇప్పటికీ కనిపిస్తుంది. హత్తిని (Hattini): హత్తిని కొమురంభీం జిల్లా దహెగాం మండలమునకు చెందిన గ్రామము. 1989, 1994లలో సిర్పూ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పాల్వాయి పురుషోత్తమరావు స్వగ్రామం. 1999 ఎన్నికలకు ముందు మావోయిస్టులు హత్యచేశారు. ఈయన సతీమణి పాల్వాయి రాజ్యలక్ష్మి 1999లో ఎమ్మెల్యేగా గెలుపొందినది. పెసరికుంట (Pesarikunta): పెసరికుంట కొమురంభీం జిల్లా దహెగాం మండలమునకు చెందిన గ్రామము. 1948 జూలై, ఆగస్టులలో ఈ ప్రాంతంలో భారత ప్రభుత్వానికి, రజాకార్లకు మధ్యన పోరాటం జరిగింది. కాల్పులలో 25మంది మరణించారు. తెనుగుపల్లి (Tenugupalli): తెనుగుపల్లి కొమురంభీం జిల్లా దహెగాం మండలమునకు చెందిన గ్రామము. 2010 సంవత్సరపు తెలుగు సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన సామల సదాశివ ఈ గ్రామానికి చెందినవారు. ఈ పురస్కారం పొందిన తొలి జిల్లావాసి ఇతనే.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Dahegoan Dahegaan Mandal, Komarambheem Dist (district) Mandal in telugu, Komuram bheem kumram bheem Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి