కొమరంభీం జిల్లా తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 15 మండలాలు ఉన్నాయి. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు కొమురం భీమ్ పేరు ఈ జిల్లాకు పెట్టబడింది. ఈ జిల్లా పరిపాలన కేంద్రం ఆసిఫాబాద్. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు ఆదిలాబాదు జిల్లాకు చెందినవి. గిరిజన పోరాటయోధుడు కొమరంభీం, ప్రముఖ సాహితీవేత్త, సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత అయిన సామల సదాశివ ఈ జిల్లాకు చెందినవారు.
మండలాలు: సిర్పూర్ (యు), లింగాపూర్, జైనూర్, తిర్యాని, ఆసిఫాబాద్, కెరమెరి, వాంకిడి, రెబ్బెన, బెజ్జూర్, పెంచికలపేట్, కాగజ్‌నగర్, కౌటాల, చింతలమనెపల్లి, దహెగాన్, సిర్పూర్ (టి). రవాణా సౌకర్యాలు: కాజీపేట నుంచి బల్హార్షా వెళ్ళు రైలుమార్గం జిల్లా గుండా ఉత్తర దక్షిణంగా వెళ్ళుచున్నది. ఇవి కూడా చూడండి:
= = = = =
ఆధారాలు:
|
Tags: News Districts in telangana, Komuram Bheem Dist in Telugu
Tags: Komuram bheem dist in Telugu, telugulo komurambheem jilla, 27 dists of telangana information, komuram bheem zilla telugulo,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి