2, జనవరి 2014, గురువారం

జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం (Jagityal Assembly Constituency)

జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. 2009 నాటి నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఈ నియోజవర్గంలో 3 మండలాలున్నాయి. ఈ సెగ్మెంట్ నిజామాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. టి.జీవన్ రెడ్డి ఇక్కడి నుంచి 6 సార్లు విజయం సాధించారు.

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గం పరిధిలో 3 మండలాలు కలవు.
 • రాయికల్,
 • సారంగాపూర్,
 • జగిత్యాల్,

సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1983 టి.జీవన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ

1985 బి.రాజేశం గౌడ్ తెలుగుదేశం పార్టీ టి.జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
1989 టి.జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ

1994 ఎల్.రమణ తెలుగుదేశం పార్టీ టి.జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
1996* టి.జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ

1999 టి.జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బి.వేణుగోపాల్ రావు తెలుగుదేశం పార్టీ
2004 టి.జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎల్.రమణ తెలుగుదేశం పార్టీ
2009 ఎల్.రమణ తెలుగుదేశం పార్టీ టి.జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2014 టి.జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సంజయ్ కుమార్ తెరాస
2018 సంజయ్ కుమార్ తెరాస టి.జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ

2004 ఎన్నికలు:2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ అభ్యర్థి టి.జీవన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎల్.రమణపై 8134 ఓట్ల మెజారిటీతో గెలుపొందినారు. జీవన్ రెడ్డికి 63812 ఓట్లు రాగా, రమణకు 55676 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు:
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రమణ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 29వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. రమణకు 73,264 ఓట్లు రాగా, జీవన్ రెడ్డి 43,415 ఓట్లు పొందినారు. ప్రజారాజ్యం నుండి చంద్రశేఖర్ గౌడ్, లోక్‌సత్తా పార్టీ టికెట్టుపై విద్యాసాగరరావు పోటీచేశారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సీనియర్ నేత టి.జీవన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెరాసకు చెందిన సంజయ్ కుమార్‌పై 7828 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి 6వ సారి శాసనసభలో ప్రవేశించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున ఎం.సంజయ్ కుమార్, భాజపా తరఫున ముదిగంటి రవీందర్ రెడ్డి, జనకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన టి.జీవన్ రెడ్డి పోటీచేశారు. తెరాసకు చెందిన ఎం.సంజయ్ కుమార్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన టి.జీవన్ రెడ్డి పై 61185 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


విభాగాలు: కరీంనగర్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, నిజామాబాదు లోకసభ నియోజకవర్గం, జగిత్యాల  అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక