ఆంధ్రప్రదేశ్ వార్తలు 2014 (Andhra Pradesh News 2014)
జనవరి 2014:
- 2014, జనవరి 3:రాష్ట్ర వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా జస్టిస్ తామడ గోపాలకృష్ణ నియమించబడ్డారు.
- 2014, జనవరి 3: ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం మాజీ కార్యదర్శి ఎల్.వెంకట్రాంరెడ్డి మరణించారు.
- 2014, జనవరి 4: మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మహాజన సోషలిస్టు పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది.
- 2014, జనవరి 4: ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ 38వ మహాసభలు తిరుపతిలో ప్రారంభమయ్యాయి.
- 2014, జనవరి 5: తెలుగు సినిమా నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
- 2014, జనవరి 5: ప్రముఖ సాహితీవేత్త కొలకలూరి ఇనాక్ ప్రతిభామూర్తి అవార్డు అందుకున్నారు.
- 2014, జనవరి 8: మాజీ కేంద్రమంత్రి యు.కృష్ణంరాజు మళ్ళీ భాజపాలో చేరారు.
- 2014, జనవరి 8: దండకారణ్యంకు చెందిన మావోయిస్టు గుడ్సా ఉసేండి (గుమ్మడవెల్లి వెంకటకిషన్ ప్రసాద్) పోలీసులకు లొంగిపోయాడు.
- 2014, జనవరి 9: కాంగ్రెస్ పార్టీ 2014 లోకసభ ఎన్నికల స్క్రీనింగ్ కమిటి రాష్ట్ర చైర్మెన్‌గా వయలార్ రవి నియమితులైనారు.
- 2014, జనవరి 9: విశాఖ ఉక్కు కర్మాగారం 5ఎస్ ధృవీకరణ పత్రం సాధించింది.
- 2014, జనవరి 9: మహబుబ్‌నగర్‌లో జరుగుతున్న పైకా జాతీయ పోటీలలో హాజీబాబా రాష్ట్రానికి తొలి స్వర్ణం అందించాడు.
- 2014, జనవరి 11: ఆంధ్రప్రదేశ్ ఆటగాడు సాకేత్ మైనేని డేవిస్ కప్ లో చోటు సంపాదించాడు.
- 2014, జనవరి 11: ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి సౌజన్య భవిశెట్టి అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య టోర్నీలో సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది.
- 2014, జనవరి 12: నేషన్స్ కప్ బాక్సింగ్ చాంప్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి నిఖిత్ జరీన్ 51 కేజీల విభాగంలో స్వర్ణం సాధించింది.
- 2014, జనవరి 13: తొలితరం సినీనటి అంజలీదేవి మరణించారు.
- 2014, జనవరి 18: జాతీయ గ్రాస్ కోర్ట్ టెన్నిస్ చాంప్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు అశ్విన్ పురుషుల డబుల్స్‌లో, భువన జోడి మహిళల డబుల్స్‌లో టైటిళ్ళు సాధించారు.
- 2014, జనవరి 20: "జై సమైక్యాంధ్ర" పేరిట కొత్త ఫార్టీ నమోదైంది.
- 2014, జనవరి 20: సర్దార్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమి డైరెక్టరుగా అరుణా బహుగుణ నియమితులైనారు.
- 2014, జనవరి 21: రంగస్థల, సినీనటుడు వి.నాగరాజారావు మరణించారు.
- 2014, జనవరి 21: గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఎం) వేతనం రూ 3000 నుంచి రూ 6000కు పెంచబడింది.
- 2014, జనవరి 22: ప్రముఖ తెలుగు సినీనటుడు అక్కినేని నాగేశ్వరరావు మరణించారు.
- 2014, జనవరి 24: ఏబివిపి రాష్ట్ర 32వ మహాసభలు నెల్లూరులో ప్రారంభమైనాయి.
- 2014, జనవరి 26: మావోయిస్టుల చేతుల్లో హతుడైన వరప్రసాద్‌కు రాష్ట్రంలోనే తొలిసారిగా అశోకచక్ర అవార్డు లభించింది.
- 2014, జనవరి 27: అధునాతన సముద్రపునౌక హోవర్ కాఫ్ట్ (హెచ్-193) విశాఖపట్టణం తీరానికి చేరింది.
- 2014, జనవరి 28: సినిమా దర్శకుడు బీరం మస్తాన్‌రావు మరణించారు.
ఫిబ్రవరి 2014:
- 2014, ఫిబ్రవరి 3: విశాఖపట్నం సాగరతీరంలో రెండో ప్రపంచయుద్ధం నాటి బంకర్ బయటపడింది.
- 2014, ఫిబ్రవరి 7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
- 2014, ఫిబ్రవరి 7: ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా కె.కేశవరావు, కెవిపి రామచంద్రారెడ్డి, టి.సుబ్బిరామిరెడ్డి, ఎంఏ ఖాన్, తోట సీతారామలక్ష్మి, గరికపాటి మోహన్ రావు ఎన్నికయ్యారు.
- 2014, ఫిబ్రవరి 8: తెలుగువ్యక్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైనారు.
- 2014, ఫిబ్రవరి 9: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైకాపాలో చేరారు.
- 2014, ఫిబ్రవరి 10: మాజీ మంత్రి చల్లా రాంభూపాల్ రెడ్డి మరణించారు.
- 2014, ఫిబ్రవరి 10: రామోజీ ఫిలింసిటికి "నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్స్" లభించింది.
- 2014, ఫిబ్రవరి 11: స్వంత పార్టీ ప్రభుత్వంపైనే అవిశ్వాస నోటీసు ఇచ్చిన ఆరుగురు కాంగ్రెస్ పార్టీ ఎంపీలను ఏఐసిసి బహిష్కరించింది.
- 2014, ఫిబ్రవరి 12: రాష్ట్ర ఉప లోకాయుక్తగా మహబూబ్‌నగర్ జిల్లా న్యాయమూర్తి టి.గంగిరెడ్డి నియమించబడ్డారు.
- 2014, ఫిబ్రవరి 13: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (తెలంగాణ ఏర్పాటు) బిల్లు లోకసభలో ప్రవేశపెట్టబడింది.
- 2014, ఫిబ్రవరి 17: కృష్ణా జిల్లా పొన్నవరంకు చెందిన జస్టిస్ నూతలపాటి వెంకటరమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైనారు.
- 2014, ఫిబ్రవరి 18: లోకసభలో తెలంగాణ ఏర్పాటు బిల్లుకు ఆమోదం లభించింది.
- 2014, ఫిబ్రవరి 18: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మెన్‌గా అదపాక సత్యారావు నియమించబడ్డారు.
- 2014, ఫిబ్రవరి 19: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పదవికి మరియు శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు.
- 2014, ఫిబ్రవరి 26: రాష్ట్ర మంత్రి టి.జి.వెంకటేష్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు.
- 2014, ఫిబ్రవరి 28: సాహితీవేత్త జానమద్ది హనుమచ్ఛాస్త్రి మరణించారు.
మార్చి 2014:
- 2014, మార్చి 1: రాష్ట్ర విభజన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర లభించింది.
- 2014, మార్చి 1: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించబడింది.
- 2014, మార్చి 2: పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురయ్యే తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది.
- 2014, మార్చి 3: ఆంధ్రప్రదేశ్‌లో పురపాలక సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబడింది.
- 2014, మార్చి 3: గవర్నరు కోటాలో ఆంధ్రప్రదేశ్ విధానసభకు ముగ్గురు ఎమ్మెల్సీలు నియమించబడ్డారు (కంతేటి సత్యనారాయణ, నంది ఎల్లయ్య, రత్నాబాయి)
- 2014, మార్చి 7: కేంద్రమంత్రిగా పనిచేసిన దగ్గుబాటి పురంధేశ్వరి భారతీయ జనతా పార్టిలో చేరారు.
- 2014, మార్చి 8: చంద్రగిరి ఎమ్మెల్యే గల్లా అరుణకుమారి తెలుగుదేశం పార్టీలో చేరారు.
- 2014, మార్చి 10: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కొత్తపార్టీ పేరును "జై సమైక్యాంధ్ర"గా ప్రకటించారు.
- 2014, మార్చి 10: సినీనటి జీవిత భారతీయ జనతా పార్టీలో చేరారు.
- 2014, మార్చి 11: సీమాంధ్ర పిసిసి అధ్యక్షుడిగా రఘువీరారెడ్డి నియమించబడ్డారు.
- 2014, మార్చి 11: కాత్యాయనీ విద్మహే 2013 సం.పు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు.
- 2014, మార్చి 12: భారతీయ జనతా పార్టీ సీమాంధ్ర శాఖ అధ్యక్షుడుగా కంభంపాటి హరిబాబు నియమించబడ్డారు.
- 2014, మార్చి 14: సినీనటుడు పవన్ కళ్యాణ్‌చే జనసేన పార్టీ ఆవిర్భవించింది.
- 2014, మార్చి 15: రాష్ట్ర మాజీ మంత్రి చిగిలిపల్లి శ్యామలరావు మరణించారు.
- 2014, మార్చి 17: ప్రపంచ అత్యుత్తమ సంగీత దర్శకులలో ఇళయరాజాకు స్థానం లభించింది.
- 2014, మార్చి 18: శేషాచలం అటవీప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది.
- 2014, మార్చి 30: రాష్ట్రంలో నగరపాలక సంస్థల మరియు పురపాలక సంఘాల ఎన్నికలు జరిగాయి.
ఏప్రిల్ 2014:
- 2014, ఏప్రిల్ 1: వయోలిన్ విధ్వాంసుడు కేవీ రెడ్డి మరణించారు.
- 2014, ఏప్రిల్ 6: ఎంపీటీసి, జడ్పీటీసి ఎన్నికల తొలి విడత పోలింగ్ జరిగింది.
- 2014, ఏప్రిల్ 11: ఎంపీటీసి, జడ్పీటీసి ఎన్నికల రెండవ విడత పోలింగ్ జరిగింది.
- 2014, ఏప్రిల్ 11: ఢిల్లీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా విశాఖపట్టణంకు చెందిన జస్టిస్ రోహిణి నియమితులైనారు.
- 2014, ఏప్రిల్ 15: కందుకూరి వీరేశలింగం జయంతిని తెలుగు నాటకరంగ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది.
- 2014, ఏప్రిల్ 16: 62వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో తెలుగు చిత్రం "నా బంగారు తల్లి" చిత్రానికి 3 పురస్కారాలు లభించాయి.
- 2014, ఏప్రిల్ 23: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలలో తెలుగు వ్యక్తి కాకర శ్యాంకుమార్ కాంస్యపతకం సాధించాడు.
- 2014, ఏప్రిల్ 23: సాంబమసూరి వరి వంగడం సృష్టికర్త, వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.వి.రెడ్డి మరణించారు.
- 2014, ఏప్రిల్ 23: టైటానియం కుంభకోణంలో కె.వి.పి.రామచంద్రారావు అరెస్టుకు ఇంటర్‌పోల్ నోటీసు జారీచేసింది.
- 2014, ఏప్రిల్ 24: కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు.
- 2014, ఏప్రిల్ 24: కర్నూలు జిల్లాకు చెందిన ఆలూరు మాజీ ఎమ్మెల్యే మసాల ఈరన్న మరణించారు.
- 2014, ఏప్రిల్ 27: తణుకు మాజీ ఎమ్మెల్యే చిట్టూరి బాపినీడు మరణించారు.
- 2014, ఏప్రిల్ 30: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఆలపాటి అప్పారావు మరణించారు.
మే 2014:
- 2014, మే 1: గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఈవూరి సీతారావమ్మ మరణించారు.
- 2014, మే 1: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికై కేంద్రం పోలవరం ప్రాజెక్టు అథారిటిని ఏర్పాటు చేసింది.
- 2014, మే 9: మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్ రెడ్డి మరణించారు.
- 2014, మే 12: పురపాలక సంఘం ఎన్నికల ఫలితాలు ప్రకటించబడ్డాయి- తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలలో విజయం సాధించింది.
- 2014, మే 13: ఎంపీటీసి, జడ్పీటీసి ఎన్నికల కౌంటింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకున్నాయి.
- 2014, మే 15: ప్రముఖ రచయిత్రి మల్లాది సుబ్బమ్మ మరణించారు.
- 2014, మే 16: శాసనసభ ఎన్నికలలో సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ పూర్తి మెజారిటి సాధించింది.
- 2014, మే 17: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి పి.ఎ.చౌదరి మరణించారు.
- 2014, మే 21: హార్మోనియం విధ్వాంసుడు ఎల్లాప్రగడ రామచంద్రారావు మరణించారు.
- 2014, మే 21: ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) వైకాపా శాసనసభపక్ష నేతగా వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు.
- 2014, మే 22: నేషనల్ జాగ్రఫిక్ క్విజ్‌లో ప్రవాస తెలుగు బాలుడు రేకులపల్లి అఖిల్ విజయం సాధించాడు.
- 2014, మే 23: సీపీఐ ఆంధ్రప్రదేశ్ శాఖ కార్యదర్శిగా కె.రామకృష్ణ నియమితులైనారు.
- 2014, మే 26: వెంకయ్యనాయుడు మరియు అశోక్ గజపతి రాజులకు నరేంద్రమోడి నాయకత్వంలోని కేంద్రప్రభుత్వంలో మంత్రిపదవులు లభించాయి.
- 2014, మే 28: తెలంగాణ పరిధిలోని పోలవరం ముంపు ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వు జారీచేయబడింది.
జూన్ 2014:
- 2014, జూన్ 4: ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబునాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- 2014, జూన్ 6: నోరి దత్తాత్రేయుడు అమెరికాకు చెందినప్రతిష్ఠాత్మక "ఎల్లిస్ ఇలాండ్ మెడల్ ఆఫ్ హానర్" పురస్కారం పొందారు.
- 2014, జూన్ 8: చంద్రబాబునాయుడు విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. (ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా)
- 2014, జూన్ 16: కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు మరణించారు.
- 2014, జూన్ 19: ఆంధ్రప్రదేశ్ అడ్వకెట్ జనరల్‌గా పి.వేణుగోపాల్ నియమితులైనారు.
- 2014, జూన్ 20: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరుగా కోడెల శివప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- 2014, జూన్ 20: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష నేతగా వై.ఎస్.జగన్ ఎన్నికయ్యారు.
- 2014, జూన్ 20: శాసనమండలి మాజీ సభ్యుడు కొల్లూరి కోటేశ్వరరావు మరణించారు.
- 2014, జూన్ 20: ధర్మవరం చేనేత పట్టు చీరలకు భారత ప్రభుత్వం నుంచి భౌగోళిక గుర్తింపు లభించింది.
- 2014, జూన్ 24: ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు జరిగిన ఉప ఎన్నికలో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- 2014, జూన్ 26: జర్మనీలోని అట్లాంటిస్‌బర్గ్ మేయర్‌గా ప్రవాస తెలుగువ్యక్తి గుజ్జల రవీంద్ర తిరిగి ఎన్నికయ్యారు.
- 2014, జూన్ 26: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో భాజపా శాసనసభ పక్ష నేతగా పెనుమత్స విష్ణుకుమార్ రాజు ఎన్నికయ్యారు.
- 2014, జూన్ 27: ఓఎన్‌జీసి గ్యాస్ పైప్‌లైన్ లీకేజి దుర్ఘటనలో 14 మంది మరణించారు.
- 2014, జూన్ 28: చెన్నైలో 13 అంతస్థుల భవనం కూలిన దుర్ఘటనలో విజయనగరం జిల్లాకు చెందిన 42 మంది మరణించారు.
జూలై 2014:
- 2014, జూలై 2: రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అల్లూరి వెంకటరామరాజు మరణించారు.
- 2014, జూలై 3: నగర పాలక సంస్థ మేయర్ల, పురపాలక/నగర పాలక సంఘాల చైర్మెన్ల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు సాధించింది.
- 2014, జూలై 4: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార సలహాదారుగా పరకాల ప్రభాకర్ నియమితులైనారు.
- 2014, జూలై 4: సీపీఎం నాయకుడు, కార్మిక నేత అల్లూరి సత్యనారాయణ మరణించారు.
- 2014, జూలై 5: జిల్లా పరిషత్తు చైర్మెన్ల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 10, వైకాపా ఒక చైర్మెన్ స్థానాలను కైవసం చేసుకున్నాయి.
- 2014, జూలై 6: చెన్నైలో గోడ కూలి శ్రీకాకుళం జిల్లాకు చెందిన 11 మంది మరణించారు.
- 2014, జూలై 23: విశాఖపట్టణం సమీపంలోని "ఎర్రమట్టి దిబ్బల"ను కేంద్రప్రభుత్వం భూవిజ్ఞాన వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.
- 2014, జూలై 24: ప్రముఖ రచయిత చేకూరి రామారావు మరణించారు.
- 2014, జూలై 25: కామన్‌వెల్త్ క్రీడలలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి మత్స సంతోషి వెయిట్‌లిఫ్టింగ్‌లో కాంస్యపతకం సాధించింది.
- 2014, జూలై 28: కేశవరెడ్డి విద్యాసంస్థల చైర్మెన్ కేశవరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఆగస్టు 2014:
- 2014, ఆగస్టు 1: 2013 సంవత్సరలు తెలుగు విశ్వవిద్యాలయం సంస్కృతీ పురస్కారం బర్మా తెలుగు సంఘానికి, 2014 సంవత్సరపు పురస్కారం చెన్నై తెలుగు సమాఖ్యకు ప్రకటించారు.
- 2014, ఆగస్టు 11: ప్రకాశం జడ్పీ చైర్మెన్ ఈదర హరిబాబుపై అనర్హత వేటు పడింది.
- 2014, ఆగస్టు 20: చైనాలో జరుగుతున్న యూత్ ఒలింపిక్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాగుల్ రజతపతకం సాధించాడు.
- 2014, ఆగస్టు 23: అప్పిరెడ్డి హరినాథరెడ్డికి కేంద్రసాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది.
- 2014, ఆగస్టు 23: రాజమండ్రి విమానాశ్రయానికి టంగుటూరి ప్రకాశం పంతులు పేరు పెడుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు.
- 2014, ఆగస్టు 31: ప్రముఖ కార్టూనిస్టు, దర్శకుడు బాపు (సత్తిరాజు లక్ష్మీనారాయణ) చెన్నైలో మరణించారు.
సెప్టెంబరు 2014:
- 2014, సెప్టెంబరు 3: కేంద్ర మాజీమంత్రి మల్లిపూడి శ్రీరామ సంజీవరావు మరణించారు.
- 2014, సెప్టెంబరు 4: విజయవాడ పరిసరాలలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు.
- 2014, సెప్టెంబరు 11: పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు (నెం 315) జారీచేసింది.
- 2014, సెప్టెంబరు 16: నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది.
- 2014, సెప్టెంబరు 19: ప్రముఖ మాండలిన్ విధ్వాంసుడు యు.శ్రీనివాస్ మరణించారు.
- 2014, సెప్టెంబరు 25: ప్రవాసాంధ్రుడు చివుకుల ఉపేంద్రకు న్యూజెర్సీ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యుటిలిటీస్ కమీషనర్‌గా పదోన్నతి లభించింది.
అక్టోబరు 2014:
- 2014, అక్టోబరు 11: ఆంధ్రప్రదేశ్ ఈఆర్‌సి చైర్మెన్‌గా జి.భవానీ ప్రసాద్ నియమితులైనారు.
- 2014, అక్టోబరు 14: ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.
- 2014, అక్టోబరు 15: ఆకాశవాణిలో "రేడియో అక్కయ్య"గా పేరుపొందిన జానకీ రాణి మరణించారు.
- 2014, అక్టోబరు 24: ఆళ్ళగడ్డ నియోజకవర్గం ఉప ఎన్నికలలో వైకాపాకు చెందిన అఖిల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నవంబరు 2014:
- 2014 నవంబరు 5: మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీలో చేరారు.
- 2014, నవంబరు 7: రచయిత్రి విశాలాక్షి మరణించారు.
- 2014, నవంబరు 9: తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి కేంద్ర మంత్రిపదవి లభించింది.
- 2014, నవంబరు 24: లోక్‌నాయక్ సాహిత్య పురస్కారం-2015కు గొల్లపూడి మారుతీరావును ఎంపికచేశారు.
డిసెంబరు 2014:
- 2014, డిసెంబరు 2: ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ చైర్మెన్ ఎ.నరసింహారెడ్డి భాజపాలో చేరారు.
- 2014, డిసెంబరు 6:నందమూరి బాలకృష్ణ కుమారుడు, సినీ నిర్మాత నందమూరి జానకీరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు.
- 2014, డిసెంబరు 8:పాత్రికేయుడు పిరాట్ల వెంకటేశ్వర్లు మరణించారు.
- 2014, డిసెంబరు 8: సంగీత విధ్వాంసుడు నేదునూరి కృష్ణమూర్తి మరణించారు.
- 2014, డిసెంబరు 14: నటుడు, రచయిత పీజే శర్మ మరణించారు.
- 2014, డిసెంబరు 15: తిరుపతి శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకటరమణ మరణించారు.
- 2014, డిసెంబరు 19: రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డికి సాహిత్య అకాడమి అవార్డు ప్రకటించబడింది. ("మన నవలలు- ,మనకథానికలు" రచనకుగాను).
- 2014, డిసెంబరు 19: అమరావతిని వారసత్వ నగరంగా కేంద్రప్రభుత్వం ఎంపికచేసింది.
- 2014, డిసెంబరు 20: ప్రముఖ న్యాయవాది, విశాఖపట్టణం మాజీ మేయరు డి.వి.సుబ్బారావు మరణించారు.
- 2014, డిసెంబరు 28: సినిమా దర్శకుడు బీరశెట్టి భాస్కరరావు మరణించారు.
- 2014, డిసెంబరు 29: గ్రంథాలయోద్యమంలో కీలకపాత్ర పోషించిన వెలగా వెంకటప్పయ్య మరణించారు.
హోం,
ఇవి కూడా చూడండి: ఆంధ్రప్రదేశ్ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2015, 2016, 2017, 2018, 2019, 2020, |
|
supe....sir
రిప్లయితొలగించండిమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు
తొలగించండిchala bagundhi
రిప్లయితొలగించండిమీ కామెంటుకు కృతజ్ఞతలు
తొలగించండిchala bagundi sir kani readmore tab pedite memu pathavi kuda chudavachhu sir
రిప్లయితొలగించండిమీరు పాతపోస్టులను చూడాలంటే విభాగాలను ఉపయోగించండి.
తొలగించండిhi sir thanks for your great help to the students for examination point of you ... really great job sir...
రిప్లయితొలగించండిమీ వ్యాఖ్య బాగుంది. ఈ బ్లాగు గురించి మీరు మరికొందరికి తెలియజేయండి.
తొలగించండిhi Sir, this is very very good site for TELUGU students....
రిప్లయితొలగించండిమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు
తొలగించండిSir super really good
రిప్లయితొలగించండికృతజ్ఞతలు
తొలగించండిRellay great idea sir.Good
రిప్లయితొలగించండి