23, జనవరి 2014, గురువారం

చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం (Choppadandi Assembly Constituency)

చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. గతంలో జనరల్ ఉండగా 2009 నియోజకవర్గాల పునర్విభజనలో రిజర్వేషన్ కిందికి కేటాయించారు. 2009లో ఈ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన సుద్దాల దేవయ్య విజయం సాధించారు. 2009 నాటి నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఈ నియోజవర్గంలో 6 మండలాలు కలవు. ఈ సెగ్మెంట్ కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గం పరిధిలో 6 మండలాలు కలవు.
  • గంగాధర,
  • రామడుగు,
  • చొప్పదండి,
  • మల్యాల్,
  • కొడిమ్యాల్,
  • బోయినపల్లి,
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1952



1957 సీహెచ్ రాజేశ్వరరావు పీడీఎఫ్

1962



1967



1972



1978



1983 జి.మాధవరెడ్డి తెలుగుదేశం పార్టీ

1985 ఎన్.రామకృష్ణారావు తెలుగుదేశం పార్టీ

1989 ఎన్.రామకృష్ణారావు తెలుగుదేశం పార్టీ కె.సత్యనారాయణ గౌడ్ కాంగ్రెస్ పార్టీ
1994 ఎన్.రామకృష్ణారావు తెలుగుదేశం పార్టీ కె.సత్యనారాయణ గౌడ్ కాంగ్రెస్ పార్టీ
1999 కె.సత్యనారాయణ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ఎన్.రామకృష్ణారావు తెలుగుదేశం పార్టీ
2004 సానా మారుతి తెలుగుదేశం పార్టీ

2009 సుద్దాల దేవయ్య తెలుగుదేశం పార్టీ జి.బాబు కాంగ్రెస్ పార్టీ
2014 బొడిగె శోభ తెరాస సుద్దాల దేవయ్య కాంగ్రెస్ పార్టీ

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన జి.బాబుపై 32998 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాసకు చెందిన బొడిగె శోభ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే అయిన సుద్దాల దేవయ్యపై 54981 ఓట్ల భారీ ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.


విభాగాలు: కరీంనగర్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, కరీంనగర్ లోకసభ నియోజకవర్గం, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక